మొబైల్, ఇంకా PCలో 2,00,000కు పైగా గేమ్‌ల ప్రపంచ స్థాయి కేటలాగ్‌ను అన్వేషించండి, మీకు సరైన గేమ్‌ను కనుగొనండి
మీరు గేమ్ కొనుగోళ్ల కోసం ఉపయోగించగల Google Play పాయింట్‌లను1 సంపాదించండి, Play Points మెంబర్‌గా ప్రత్యేకమైన పెర్క్‌లను పొందండి
మీకు ఇష్టమైన గేమ్‌లతో పాటు మీ సొంత గేమింగ్ విజయాలకు సంబంధించిన అప్‌డేట్‌లు అన్నీ ఒకే అనుకూలమైన ఖాతా ట్యాబ్‌లో2 ఉన్నాయి
Google Play పాయింట్‌లతో తదుపరి స్థాయి రివార్డ్‌లను అన్‌లాక్ చేయండి, ఇది Google Play రివార్డ్‌ల ప్రోగ్రామ్, ఇందులో మీరు డిస్కౌంట్‌లు, గేమ్‌లోని వస్తువుల కోసం ఉపయోగించడానికి పాయింట్‌లను, రివార్డ్‌లను పొందవచ్చు. మీరు ఎంత ఎక్కువ Play పాయింట్‌లు సంపాదిస్తే, అంత ఎక్కువ అద్భుతమైన రివార్డ్‌లు, పెర్క్‌లు, డబ్బుతో కొనలేని ఎక్స్‌పీరియన్స్‌లు అన్‌లాక్ అవుతాయి. ఇప్పుడే చేరండి 1.
ఖాతా ట్యాబ్ మధ్యలో మీ గేమర్ ప్రొఫైల్ ఉంటుంది. మొబైల్‌లో ప్రొఫైల్ చిహ్నాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఎప్పుడైనా ఖాతా ట్యాబ్ నుండి గేమర్ ప్రొఫైల్‌కు సులభంగా మారవచ్చు. మొబైల్, PC అంతటా ఒకే ప్రొఫైల్‌తో, మీ గేమ్‌లలో మీ గణాంకాలను, స్ట్రీక్‌లను, ప్రోగ్రెస్‌ను, ఇంకా విజయాలను మీరు సులభంగా ట్రాక్ చేయవచ్చు. ప్రతి సాధన, ప్రతి విజయం – ఇవన్నీ వేడుక జరుపుకోవడానికి ఇక్కడ ఉన్నాయి.
Play Games ఓవర్‌లే డ్యాష్‌బోర్డ్ అనేది, Gemini Liveతో అందుబాటులో ఉండే ఒక కొత్త గేమింగ్ కంప్యానియన్. దీని సహాయంతో మీరు ఆడే గేమ్ నుండి ఎగ్జిట్ అవ్వకుండానే మీ గణాంకాలు, విజయాలు, చిట్కాల వంటి వాటిని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. అంతే కాకుండా, గేమ్ ఆడుతున్న సమయంలో Gemini Live మీతో చాట్ చేస్తూ రియల్ టైంలో గైడెన్స్ కూడా ఇవ్వగలదు. ఓవర్‌లే డ్యాష్‌బోర్డ్, Google Play నుండి డౌన్‌లోడ్ చేసుకున్న గేమ్‌లను ఆడుతున్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటుంది, త్వరలోనే ఇది మొబైల్‌లోకి కూడా అందుబాటులోకి వస్తుంది.
Google నుండి సెక్యూరిటీ, అలాగే రక్షణతో మొబైల్, ఇంకా PC అంతటా పూర్తి విశ్వాసంతో ఆడండి. మీ డేటా, ఇంకా డివైజ్‌లను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి మేము అందించే ప్రతి గేమ్‌లో Google Play 10,000 కంటే ఎక్కువ సేఫ్టీ చెక్‌లను నిర్వహిస్తుంది.