Google డిస్క్ అదనపు సేవా నిబంధనలు

అమలులోకి వచ్చే తేదీ: మార్చి 31, 2020 (మునుపటి వెర్షన్‌ను చూడండి)

Google డిస్క్‌ను ఉపయోగించాలంటే, మీరు తప్పనిసరిగా (1) Google సేవా నిబంధనలు, (2) ఈ Google డిస్క్ అదనపు సేవా నిబంధనల (“Google డిస్క్ అదనపు నిబంధనలు”)కు అంగీకరించాలి.

దయచేసి ఈ డాక్యుమెంట్‌లన్నీ జాగ్రత్తగా చదవండి. ఈ డాక్యుమెంట్‌లన్నీ కలిపి “నిబంధనలు”గా వ్యవహరించబడతాయి. మీరు మా సేవలను వినియోగించే సమయంలో పరస్పరం ఒకరి నుండి ఇంకొకరం ఏమి అశించవచ్చనే విషయాలను ఇవి తెలియజేస్తాయి.

ఇది ఈ నిబంధనలలో భాగం కానప్పటికీ, మీరు మా గోప్యతా పాలసీని కూడా చదవడం ద్వారా మీ సమాచారాన్ని అప్‌డేట్ చేయడం, మేనేజ్ చేయడం, ఎగుమతి చేయడం, తొలగించడం ఎలాగనే విషయం మరింత మెరుగ్గా అర్థం చేసుకోవాల్సిందిగా మీకు సిఫార్సు చేస్తున్నాము.

1. మీ కంటెంట్

మీరు Google డిస్క్‌లో కంటెంట్‌ను అప్‌లోడ్ చేయగలరు, సమర్పించగలరు, నిల్వ చేయగలరు, ఇతరులకు పంపగలరు, అందుకోగలరు. Google సేవా నిబంధనలలో వివరించినట్లుగా, మీ కంటెంట్ మీదిగానే ఉంటుంది. మీ డ్రైవ్ ఖాతాలో మీరు అప్‌లోడ్ చేసే, షేర్ చేసే లేదా నిల్వ చేసే వచనం, డేటా, సమాచారం, ఫైల్‌లతో సహా మీ కంటెంట్ దేని పైనా యాజమాన్య హక్కును మేము క్లెయిమ్ చేయము. Google డిస్క్ సేవలను నిర్వహించడం, మెరుగుపరచడం కోసం, Google సేవా నిబంధనల ప్రకారం Googleకు పరిమిత ప్రయోజనకర లైసెన్స్ ఉంటుంది — కాబట్టి మీరు ఒక డాక్యుమెంట్‌ను ఎవరితోనైనా షేర్ చేయాలని నిర్ణయించుకుంటే లేదా వేరే పరికరంలో తెరవాలనుకుంటే, మేము ఆ నిర్వహణ సామర్థ్యాన్ని అందించగలము.

ఇతర Google డిస్క్ యూజర్‌ల కంటెంట్‌లో సహకారం అందించడానికి కూడా Google డిస్క్ మిమ్మల్ని అనుమతిస్తుంది. ఆ కంటెంట్‌కు “యజమాని” అయిన వ్యక్తి, ఆ కంటెంట్‌ను, దాని వినియోగాన్ని నియంత్రించగలుగుతారు.

Google డిస్క్‌లోని షేరింగ్ సెట్టింగ్‌ల సహాయంతో Google డిస్క్‌లోని మీ కంటెంట్‌పై ఇతరులకు ఎలాంటి సామర్థ్యాలు ఉండాలనేది మీరు నియంత్రించగలరు. మీ ఫైల్‌ల గోప్యతా సెట్టింగ్‌లు, అవి ఉన్న ఫోల్డర్ లేదా డ్రైవ్‌పై ఆధారపడి ఉంటాయి. మీ వ్యక్తిగత డిస్క్‌లోని ఫైల్‌లు మీరు షేరింగ్ నిర్ణయం తీసుకోనంత వరకు ప్రైవేట్‌గానే ఉంటాయి. మీరు మీ కంటెంట్‌ను షేర్ చేసుకోవచ్చు, అలాగే మీ కంటెంట్‌పై నియంత్రణను ఇతర యూజర్‌లకు బదిలీ చేయవచ్చు. ఇతరులు షేర్ చేసిన ఫోల్డర్‌లు లేదా డ్రైవ్‌లలో మీరు సృష్టించే లేదా నిల్వ చేసే ఫైల్‌లకు అవి ఉన్న ఫోల్డర్ లేదా డ్రైవ్‌కు వర్తించే షేరింగ్ సెట్టింగ్‌లు వర్తిస్తాయి, అదే రీతిలోనే యాజమాన్య హక్కు సెట్టింగ్‌లు కూడా వర్తించే అవకాశం ఉంది. మేము మీ ఫైల్‌లు, డేటాను మా గోప్యతా పాలసీలో వివరించినట్లుగా తప్పించి, ఇతర పద్ధతులలో షేర్ చేయము.

మేము మీ కంటెంట్‌ను మార్కెటింగ్ లేదా ప్రచార సంబంధిత క్యాంపెయిన్‌ల కోసం వినియోగించము.

2. ప్రోగ్రామ్ పాలసీలు

చట్ట విరుద్ధంగా లేదా మా ప్రోగ్రామ్ పాలసీలు ఉల్లంఘించే విధంగా ఏదైనా ఉంటే గుర్తించడానికి, మేము కంటెంట్‌ను రివ్యూ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మా పాలసీలు లేదా చట్టాన్ని ఉల్లంఘిస్తోందని మేము సహేతుకంగా భావించే సందర్భాలలో ఆ కంటెంట్‌ను మేము తీసివేయడం లేదా ప్రదర్శనకు నిరాకరించడం లాంటి చర్యలు తీసుకోవచ్చు. దీనర్థం, మేము కంటెంట్‌ను తప్పకుండా రివ్యూ చేస్తామని కాదు, కనుక మేము అలా చేస్తామని భావించకండి.