Google డిస్క్ సేవా నిబంధనలు

చివరిగా డిసెంబర్ 10, 2018 సవరించారు అమలులోకి వచ్చే తేదీ: జనవరి 22, 2019

1. పరిచయం

Google డిస్క్‌ను ఉపయోగించినందుకు ధన్యవాదాలు. Google డిస్క్ అనేది 1600 Amphitheatre Parkway, Mountain View California 94043, USA వద్ద ఉన్న Google LLC (“Google”, “మాకు” లేదా “మేము”) అందిస్తున్న సేవ. మీరు ఐరోపా ఆర్థిక మండలి లేదా స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్నట్లయితే, Google డిస్క్ అనేది Google Ireland Limited (“Google”, “మాకు” లేదా “మేము”)చే అందించబడుతుంది, ఇది ఐర్లాండ్ యొక్క చట్టాల కింద విలీనం చేయబడిన మరియు నిర్వహిస్తున్న (నమోదు సంఖ్య: 368047) మరియు Gordon House, Barrow Street, Dublin 4, Ireland వద్ద ఉన్న ఒక సంస్థ.. ఈ Google డిస్క్ సేవా నిబంధనలు (మేము “నిబంధనలు” అని పేర్కొంటాము) మీ Google డిస్క్ వినియోగం మరియు యాక్సెస్ అలాగే Google డిస్క్‌లో మీ కంటెంట్‌కు వర్తిస్తాయి. మా గోప్యతా విధానం మేము మీ సమాచారాన్ని ఎలా సేకరిస్తాము మరియు ఉపయోగిస్తాము అనేది వివరిస్తే మా ప్రోగ్రామ్ విధానాలు మా సేవను ఉపయోగిస్తున్నప్పుడు మీ బాధ్యతలను క్లుప్తంగా తెలియచేస్తాయి.

మీరు Google డిస్క్‌ను ఉపయోగించాలంటే నిబంధనలకు అంగీకరించాలి. దయచేసి వాటిని జాగ్రత్తగా చదవండి. మీకు నిబంధనలు అర్థం కాని పక్షంలో లేదా వాటిలో ఏదైనా ఆమోదించలేని పక్షంలో, మీరు Google డిస్క్‌ను ఉపయోగించకూడదు.

2. మీ Google డిస్క్ వినియోగం

వయస్సు పరిమితులు. Google డిస్క్‌ని ఉపయోగించాలంటే మీ వయస్సు 13 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. మీ వయస్సు 13 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా 18 సంవత్సరాల కంటే తక్కువ అయితే, మీరు తప్పనిసరిగా మీ తల్లి/తండ్రి లేదా సంరక్షకుల నుండి అనుమతి పొందిన తర్వాత Google డిస్క్‌ని ఉపయోగించాలి మరియు నిబంధనలను ఆమోదించాలి.

వ్యక్తిగత ఉపయోగం. ఈ నిబంధనలను ఆమోదించడం ద్వారా, Google డిస్క్‌ను వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించరని మీరు అంగీకరిస్తున్నారు; మీరు తప్పనిసరిగా వ్యక్తిగత వాణిజ్యేతర ప్రయోజనాల కోసం మాత్రమే డిస్క్ సేవను ఉపయోగించాలి. వ్యాపార సంస్థల కోసం GSuite ని ఉపయోగించమని మేము సిఫార్సు చేస్తున్నాము.

మీ Google ఖాతా. Google డిస్క్‌ను ఉపయోగించాలంటే మీ వద్ద Google ఖాతా ఉండాలి. మీ Google ఖాతాను సంరక్షించడానికి, మీ పాస్‌వర్డ్‌ను గోప్యంగా ఉంచండి. మీ Google ఖాతాలో లేదా దాని ద్వారా సంభవించే కార్యకలాపానికి మీరే బాధ్యత వహించాలి. మూడవ పక్ష అప్లికేషన్‌లలో మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను పునర్వినియోగించకుండా ఉండేలా చూసుకోండి. మీకు మీ పాస్‌వర్డ్ లేదా Google ఖాతా యొక్క ఏదైనా అనధికారిక వినియోగం గురించి తెలిస్తే, ఈ సూచనలను అనుసరించండి.

మీ ప్రవర్తన. Google డిస్క్‌ను దుర్వినియోగం చేయవద్దు. మీరు వర్తించే ఎగుమతి మరియు పునఃఎగుమతి నియంత్రణ చట్టాలు మరియు నియమాలతో సహా చట్టప్రకారం అనుమతించబడినట్లుగా మాత్రమే Google డిస్క్‌ను ఉపయోగించవచ్చు. మీ ప్రవర్తన మరియు Google డిస్క్‌లో నిల్వ చేయబడే మీ కంటెంట్ విషయాలకు మీరే బాధ్యత వహించాలి మరియు తప్పనిసరిగా మా ప్రోగ్రామ్ విధానాలు కి కట్టుబడి ఉండాలి. నిబంధనలు మరియు మా ప్రోగ్రామ్ విధానాలు కి మీ ప్రవర్తన మరియు Google డిస్క్‌లో కంటెంట్ అనుకూలంగా ఉన్నాయో లేవో మేము సమీక్షించవచ్చు.

Google డిస్క్ మొబైల్ పరికరాల్లో అందుబాటులో ఉంటుంది. మీకు అంతరాయం కలిగించే మరియు ట్రాఫిక్ లేదా భద్రతా చట్టాలను అనుసరించలేకుండా మిమ్మల్ని నిరోధించే రీతిలో Google డిస్క్‌ను ఉపయోగించవద్దు.

మీ కంటెంట్. కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడానికి, సమర్పించడానికి, నిల్వ చేయడానికి, పంపడానికి మరియు స్వీకరించడానికి Google డిస్క్ మిమ్మల్ని అనుమతిస్తుంది. ఆ కంటెంట్‌పై మీకు ఉన్న ఏవైనా మేధోపరమైన ఆస్తి హక్కుల యాజమాన్యాన్ని మీరు అలాగే కలిగి ఉంటారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, మీకు చెందినవన్నీ మీకే ఉంటాయి.

మీరు Google డిస్క్‌కు లేదా దాని ద్వారా కంటెంట్‌ను అప్‌లోడ్ చేసినప్పుడు, సమర్పించినప్పుడు, నిల్వ చేసినప్పుడు, పంపినప్పుడు లేదా స్వీకరించినప్పుడు, ఆ కంటెంట్‌ను ఉపయోగించడం, హోస్ట్ చేయడం, నిల్వ చేయడం, పునరుత్పాదించడం, సవరించడం, అనుబంధ రచనలను సృష్టించడం (అనువాదాలు, అనుకూల సవరణలు లేదా మా సేవలతో మీ కంటెంట్ మెరుగ్గా పని చేసేలా చేయడం కోసం మేము చేసే మార్పులు), కమ్యూనికేట్ చేయడం, ప్రచురించడం, పబ్లిక్‌గా అమలు చేయడం, పబ్లిక్‌గా ప్రదర్శించడం మరియు పంపిణీ చేయడం కోసం Googleకి ప్రపంచవ్యాప్త లైసెన్స్‌ను అందిస్తున్నారు. ఈ లైసెన్స్‌లో మీరు మంజూరు చేసే హక్కులు మా సేవలను నిర్వహించడం, ప్రచారం చేయడం మరియు మెరుగుపరచడం, అలాగే కొత్త వాటిని అభివృద్ధిపరచడం వంటి పరిమిత ప్రయోజనాల కోసం ఉద్దేశించబడతాయి. మీరు మీ కంటెంట్‌ను తొలగిస్తే తప్ప మా సేవలను ఉపయోగించడం ఆపివేసినప్పటికీ ఈ లైసెన్స్ కొనసాగుతుంది. మీరు Google డిస్క్‌కు సమర్పించే ఏదైనా కంటెంట్ కోసం ఈ లైసెన్స్‌ను మాకు మంజూరు చేయడానికి అవసరమైన హక్కులను మీరు కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి.

Google డిస్క్‌లోని భాగస్వామ్య సెట్టింగ్‌లు Google డిస్క్‌లో ఇతరులు మీ కంటెంట్‌తో చేయగల కార్యాచరణలను నియంత్రించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. మీరు Google డిస్క్‌లో సృష్టించే లేదా దానికి అప్‌లోడ్ చేసే మొత్తం కంటెంట్‌కు డిఫాల్ట్‌గా మీరు కంట్రోలర్‌గా సెటప్ చేయబడతారు. మీరు మీ కంటెంట్‌ను భాగస్వామ్యం చేయవచ్చు మరియు మీ కంటెంట్‌పై నియంత్రణను ఇతర వినియోగదారులకు బదిలీ చేయవచ్చు.

మా స్వయంచాలక సిస్టమ్‌లు అనుకూలీకరించిన శోధన ఫలితాలు, అలాగే స్పామ్ మరియు మాల్వేర్ గుర్తింపు వంటి సముచిత ఉత్పత్తి లక్షణాలను మీకు వ్యక్తిగతంగా అందించడానికి మీ కంటెంట్‌ను విశ్లేషిస్తాయి. ఈ విశ్లేషణ కంటెంట్‌ను స్వీకరించినప్పుడు, భాగస్వామ్యం చేసినప్పుడు, అప్‌లోడ్ చేసినప్పుడు మరియు నిల్వ చేసినప్పుడు జరుగుతుంది. Google కంటెంట్‌ను వినియోగించే మరియు నిల్వ చేసే విధానం గురించి మీరు మా గోప్యతా విధానం లో మరింత సమాచారాన్ని పొందవచ్చు. మీరు Google డిస్క్ గురించి అభిప్రాయాన్ని లేదా సూచనలను సమర్పిస్తే, మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము మీ అభిప్రాయాన్ని లేదా సూచనలను ఉపయోగించవచ్చు.

ప్రకటనలు. మీ Google డిస్క్ ఉపయోగానికి సంబంధించి, మేము మీకు సేవా ప్రకటనలు, నిర్వహణ సందేశాలు మరియు ఇతర సమాచారాన్ని పంపవచ్చు. మీరు ఆ కమ్యూనికేషన్‌ల్లో కొన్నింటిని నిలిపివేయవచ్చు.

మా Google డిస్క్ సేవలు. Google డిస్క్‌ను ఉపయోగించినంత మాత్రాన Google డిస్క్ లేదా మీరు యాక్సెస్ చేసే కంటెంట్‌పై ఏ మేధోపరమైన ఆస్తి హక్కుల యాజమాన్యం కూడా మీకు అందించబడదు. మీరు Google డిస్క్‌లో నిర్దిష్ట యజమాని నుండి అనుమతిని పొందినప్పుడు లేదా చట్ట ప్రకారం అనుమతించబడినప్పుడు మినహా ఆ కంటెంట్‌ను ఉపయోగించలేకపోవచ్చు. ఈ నిబంధనలు Google డిస్క్‌లో ఉపయోగించబడిన ఏవైనా బ్రాండింగ్ లేదా లోగోలను ఉపయోగించే హక్కును మీకు మంజూరు చేయవు. Google డిస్క్‌లో లేదా దానితో పాటు ప్రదర్శించబడే ఏవైనా చట్టపరమైన నోటీసులను తీసివేయవద్దు, అస్పష్టం చేయవద్దు లేదా సవరించవద్దు.

3. గోప్యతా సంరక్షణ

మీరు Google డిస్క్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మేము మీ వ్యక్తిగత డేటాను ఎలా పరిగణిస్తాము మరియు మీ గోప్యతను ఎలా సంరక్షిస్తామనే అంశాలను Google యొక్క గోప్యతా విధానం వివరిస్తుంది. మీరు Google డిస్క్‌ను ఉపయోగించడం ద్వారా, మా గోప్యతా విధానాలకు అనుగుణంగా Google అటువంటి డేటాను ఉపయోగించడానికి మీరు అంగీకరిస్తున్నారు.

4. కాపీరైట్ సంరక్షణ

మేము యు.ఎస్ డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టంలో సూచించిన ప్రక్రియ ప్రకారం కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణ నోటీసులకు ప్రతిస్పందిస్తాము మరియు పునరావృతంగా ఉల్లంఘించేవారి ఖాతాలను రద్దు చేస్తాము.

కాపీరైట్ హక్కుదారులు ఆన్‌లైన్‌లో వారి మేధోపరమైన ఆస్తిని నిర్వహించడంలో సహాయపడటానికి మేము సమాచారాన్ని అందిస్తాము. ఎవరైనా ఒకరు మీ కాపీరైట్ హక్కులను ఉల్లంఘిస్తున్నట్లు మీరు భావిస్తే మరియు ఆ విషయాన్ని మాకు తెలియజేయాలనుకుంటే, మీరు నోటీసులను సమర్పించడం మరియు నోటీసులకు ప్రతిస్పందించడంపై Google విధానం గురించిన సమాచారాన్ని మా సహాయ కేంద్రం లో పొందవచ్చు.

5. ప్రోగ్రామ్ విధానాలు

మేము కంటెంట్ చట్ట వ్యతిరేకంగా ఉందో లేదో లేదా మా ప్రోగ్రామ్ విధానాలు ని ఉల్లంఘిస్తోందో లేదో కనుగొనడానికి దాన్ని సమీక్షించవచ్చు, అలాగే మా విధానాలను లేదా చట్టాన్ని ఉల్లంఘించినట్లు మేము సహేతుకంగా విశ్వసించే కంటెంట్‌ను తీసివేయవచ్చు లేదా ప్రదర్శించడానికి నిరాకరించవచ్చు. కానీ దీనర్థం మేము కంటెంట్‌ను తప్పనిసరిగా సమీక్షిస్తామని కాదు, కాబట్టి దయచేసి మేము అలా చేస్తామని భావించవద్దు.

6. మా సేవల్లో సాఫ్ట్‌వేర్ గురించి

క్లయింట్ సాఫ్ట్‌వేర్. Google డిస్క్‌లో డౌన్‌లోడ్ చేసుకోగల క్లయింట్ సాఫ్ట్‌వేర్ (“సాఫ్ట్‌వేర్”) ఉండవచ్చు. కొత్త వెర్షన్ లేదా ఫీచర్ అందుబాటులో ఉన్నప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ మీ పరికరంలో స్వయంచాలకంగా అప్‌డేట్ కావచ్చు. Google డిస్క్‌లో భాగంగా Google మీకు అందించిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం కోసం Google మీకు వ్యక్తిగత, ప్రపంచవ్యాప్త, రాయల్టీ రహిత, కేటాయించలేని మరియు అపరిమిత లైసెన్స్‌ను అందిస్తుంది. ఈ నిబంధనల ప్రకారం అనుమతి ఉన్న పద్ధతిలో Google అందిస్తున్న Google డిస్క్‌ను మీరు ఉపయోగించడం మరియు దాని ప్రయోజనాలను ఆస్వాదించడం కోసం మాత్రమే ఈ లైసెన్స్ అందించబడుతుంది. చట్ట ప్రకారం ఆ నియంత్రణలు నిషిద్ధమైతే లేదా మీరు మా వ్రాతపూర్వక అనుమతిని కలిగి ఉంటే మినహా మీరు Google డిస్క్‌లో ఏదైనా భాగాన్ని లేదా అందులో చేర్చిన సాఫ్ట్‌వేర్‌ను కాపీ, సవరణ, పంపిణీ, విక్రయం లేదా లీజుకి ఇవ్వడం వంటివి చేయకూడదు, అలాగే మీరు ఆ సాఫ్ట్‌వేర్‌ను రివర్స్ ఇంజినీరింగ్ చేయకూడదు లేదా సోర్స్ కోడ్‌ను సంగ్రహించడానికి ప్రయత్నించకూడదు.

ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ మాకు చాలా ముఖ్యం. Google డిస్క్‌లో ఉపయోగించిన కొంత భాగం సాఫ్ట్‌వేర్‌ని మేము మీకు అందుబాటులో ఉంచే ఓపెన్ సోర్స్ లైసెన్స్ ద్వారా అందించవచ్చు. ఈ నిబంధనల్లో కొన్నింటిని స్పష్టంగా భర్తీ చేసే నియమాలు ఓపెన్ సోర్స్ లైసెన్స్‌లో ఉండవచ్చు.

7. Google డిస్క్‌ను సవరించడం మరియు రద్దు చేయడం

Google డిస్క్‌కి మార్పులు. మేము నిరంతరం Google డిస్క్‌లో మార్పులు మరియు మెరుగుదలలు చేస్తుంటాము. మేము పనితీరు లేదా భద్రతలో మెరుగుదలలు చేయవచ్చు, కార్యాచరణలు లేదా ఫీచర్‌లను మార్చవచ్చు లేదా చట్టాన్ని పాటించడం లేదా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలను నివారించడం లేదా మా సిస్టమ్‌ల దుర్వినియోగాన్ని నివారించడం కోసం మార్పులు చేయవచ్చు. Google డిస్క్‌కి సంబంధించిన సమాచారాన్ని పొందడం కోసం మీరు ఇక్కడ చందాని పొందవచ్చు. మేము Google డిస్క్‌లో ముఖ్యమైన మార్పులు చేసే సమయంలో, అవి మీ Google డిస్క్ ఉపయోగంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని మేము భావించినట్లయితే, మీకు తెలియజేస్తాము. అయితే, కొన్ని సందర్భాలలో మేము మీకు తెలియజేయకుండానే Google డిస్క్‌కి మార్పులు చేయాల్సి రావచ్చు. సేవలో భద్రత మరియు పనితీరు ఖచ్చితత్వాన్ని నిర్ధారించుకోవడం, దుర్వినియోగాన్ని నివారించడం లేదా చట్టపరమైన అవసరాలకు తగ్గట్లు మేము చర్యలు తీసుకోవాల్సి రావడం వంటి కొన్ని పరిమిత సందర్భాలలో మాత్రమే ఇలా జరగవచ్చు.

తాత్కాలిక నిలిపివేత మరియు శాశ్వత నిలిపివేత. మీరు నిష్క్రమించడం మాకు బాధగా ఉన్నప్పటికీ Google డిస్క్‌ను ఉపయోగించడం ఎప్పుడైనా ఆపివేయవచ్చు. మీరు గణనీయంగా లేదా పునరావృతంగా మా నిబంధనలు లేదా మా ప్రోగ్రామ్ విధానాలు ని ఉల్లంఘించినట్లయితే మేము Google డిస్క్‌కు మీ యాక్సెస్‌ని తాత్కాలికంగా నిలిపివేయవచ్చు లేదా శాశ్వతంగా నిలిపివేయవచ్చు. మేము Google డిస్క్‌కు మీ యాక్సెస్‌ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నప్పుడు లేదా శాశ్వతంగా నిలిపివేస్తున్నప్పుడు మీకు ముందస్తు నోటీసు అందిస్తాము. అయితే, మాపై చట్టపరమైన వ్యాజ్యం దాఖలు చేయబడే లేదా ఇతరులు Google డిస్క్‌ను యాక్సెస్ చేయగల మరియు ఉపయోగించగల సామర్థ్యానికి అంతరాయం కలిగించే రీతిలో మీరు Google డిస్క్‌ను ఉపయోగిస్తున్న పక్షంలో, మేము ఎలాంటి నోటీసు అందించకుండానే Google డిస్క్‌కు మీ యాక్సెస్‌ని తాత్కాలికంగా నిలిపివేయవచ్చు లేదా శాశ్వతంగా నిలిపివేయవచ్చు.

Google డిస్క్ ఉపసంహరణ. మేము Google డిస్క్‌ను ఆపివేయాలని నిర్ణయించుకుంటే, కనీసం 60 రోజుల ముందుగా మీకు నోటీసును పంపుతాము. ఈ నోటీసు వ్యవధిలో, Google డిస్క్ నుండి మీ ఫైల్‌లను పొందే అవకాశం మీకు ఉంటుంది. ఈ 60 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత, మీరు మీ ఫైల్‌లను యాక్సెస్ చేయలేరు. మీ ఫైల్‌లకు యజమాని మీరేనని మరియు ఆ ఫైల్‌లకు మీ యాక్సెస్‌ను భద్రపరచడం చాలా ముఖ్యమని మేము విశ్వసిస్తున్నాము. మీ ఫైల్‌లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలిపే సూచనల కోసం, దయచేసి మా మద్దతు పేజీ ని సందర్శించండి.

8. అదనపు నిల్వను కొనుగోలు చేయడం మరియు చెల్లింపులు

ఉచిత నిల్వ. 15 GB ఉచిత Google ఆన్‌లైన్ నిల్వను ఉపయోగించడానికి Google మిమ్మల్ని అనుమతిస్తుంది (నిబంధనలకు మీ అనుకూలత ఆధారంగా ఉంటుంది), ఈ నిల్వను Google డిస్క్, Gmail మరియు Google ఫోటోలులో ఉపయోగించవచ్చు.

అదనపు నిల్వ కొనుగోలు. మీకు అవసరమైనప్పుడు మీరు అదనపు నిల్వ ను (“చెల్లింపు నిల్వ ప్లాన్”) కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు రద్దు చేసే వరకు, చెల్లింపు నిల్వ ప్లాన్‌కు మార్చిన తేదీ నుండి ప్రతి సమయానుగుణ సేవా వ్యవధి పునరుద్ధరణకు మేము స్వయంచాలకంగా మీకు బిల్ చేస్తాము. మీరు చెల్లింపు నిల్వ ప్లాన్‌ను కొనుగోలు చేయాలంటే, తప్పనిసరిగా Google చెల్లింపుల సేవా నిబంధనల్లో పేర్కొన్న చెల్లింపు నిబంధనలకు అంగీకరించాలి. మీ వద్ద Google చెల్లింపు ఖాతా లేకపోతే, మీరు ఈ లింక్‌‌కి వెళ్లడం ద్వారా ఒక దాన్ని సెటప్ చేయవచ్చు, ఇందులో మీరు Google చెల్లింపుల గురించి మరింత సమాచారాన్ని కూడా పొందవచ్చు. అలాగే మీరు Google చెల్లింపుల ఖాతాను ఉపయోగించి చెల్లింపు నిల్వ ప్లాన్‌ను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు చెల్లింపుల సేవా నిబంధనలు మరియు గోప్యతా ప్రకటన వర్తిస్తాయి. దయచేసి ఏదైనా కొనుగోలు చేయడానికి ముందు ఈ నిబంధనలను క్షుణ్ణంగా చదివినట్లు నిర్ధారించుకోండి.

రద్దు. మీ చెల్లింపు నిల్వ ప్లాన్‌‌ను నిబంధనల ప్రకారం రద్దు, డౌన్‌గ్రేడ్ లేదా శాశ్వతంగా నిలిపివేసే వరకు ప్రభావంలో ఉంటుంది. మీరు ఏ సమయంలో అయినా మీ Google డిస్క్ నిల్వ సెట్టింగ్‌లు నుండి మీ చెల్లింపు నిల్వ ప్లాన్‌ని రద్దు లేదా డౌన్‌గ్రేడ్ చేయవచ్చు. ప్రస్తుత సేవా వ్యవధి ముగిసిన తర్వాత తదుపరి బిల్లింగ్ వ్యవధి నుండి మీ రద్దు లేదా డౌన్‌గ్రేడ్ వర్తిస్తుంది. మీరు సకాలంలో మీ చెల్లింపు నిల్వ ప్లాన్ కోసం చెల్లించకుంటే, మీ ఖాతాని డౌన్‌గ్రేడ్ చేయగల మరియు మీ నిల్వని ఉచిత స్థలం స్థాయిలకు తగ్గించగల హక్కు మాకు ఉంది. మా కొనుగోలు, రద్దు మరియు తిరిగి చెల్లింపు విధానం ప్రకారం మీ చెల్లింపు నిల్వ ప్లాన్ యొక్క రద్దు మరియు తిరిగి చెల్లింపు ప్రక్రియలు జరుగుతాయి.

ప్లాన్ మరియు ధరలో మార్పులు. అమలులో ఉన్న నిల్వ ప్లాన్ మరియు ధరకు మేము మార్పులు చేయవచ్చు, కానీ ఈ మార్పుల గురించి మీకు ముందస్తు నోటీసును అందిస్తాము. ఈ మార్పులు మీ ప్రస్తుత సేవ వ్యవధి గడువు ముగిసిన తర్వాత, నోటీసు ఇచ్చిన తర్వాత మీరు తదుపరి చెల్లింపు చేయాల్సి ఉన్నప్పుడు వర్తిస్తాయి. మీకు ఛార్జీ విధించడానికి ముందు ధర పెంపుదల లేదా నిల్వ ప్లాన్ తగ్గింపు గురించి తెలియజేస్తూ కనీసం 30 రోజులు ముందే నోటీసులు అందిస్తాము. మీకు 30 రోజుల కంటే తక్కువ సమయంలో ముందస్తు నోటీసు అందించినట్లయితే, తదుపరి చెల్లింపు తర్వాత మరో చెల్లింపు చేసే వరకు ఈ మార్పు వర్తించదు. అప్‌డేట్ చేయబడిన నిల్వ ప్లాన్ లేదా ధరతో మీరు కొనసాగాలనుకోకపోతే, మీ Google డిస్క్ నిల్వ సెట్టింగ్‌లు లో ఎప్పుడైనా మీ చెల్లింపు నిల్వ ప్లాన్‌ను రద్దు చేయవచ్చు లేదా డౌన్‌గ్రేడ్ చేయవచ్చు. మీ రద్దు లేదా డౌన్‌గ్రేడ్ ప్రస్తుత సేవా వ్యవధి ముగిసిన తర్వాత తదుపరి బిల్లింగ్ వ్యవధికి వర్తిస్తుంది; మేము మీ ఫైల్‌లను మీకు అందుబాటులో ఉంచడం కొనసాగిస్తాము లేదా Google డిస్క్ నుండి మీ ఫైల్‌లను పొందడానికి మీకు అవకాశం ఇస్తాము.

9. మా వారెంటీలు మరియు అస్వీకరణలు

మేము తగిన స్థాయిలో నైపుణ్యం మరియు సంరక్షణతో Google డిస్క్‌ను అందిస్తున్నాము, కనుక మీరు Google డిస్క్‌ను ఉపయోగించడాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము. అయితే, Google డిస్క్ గురించి మేము హామీ ఇవ్వలేని నిర్దిష్ట అంశాలు కొన్ని ఉన్నాయి. మేము స్పష్టంగా పేర్కొన్నవి మినహా Google డిస్క్ ద్వారా అందుబాటులో ఉన్న నిర్దిష్ట కార్యకలాపం, విశ్వసనీయత, లభ్యత లేదా మీ అవసరాలను నెరవేర్చగల సామర్థ్యం వంటి విషయాల్లో ఎలాంటి వాగ్దానాలు చేయము.

10. Google డిస్క్ బాధ్యత

Google, అలాగే దాని సరఫరాదారులు మరియు పంపిణీదారులు వీటికి బాధ్యత వహించరు:

(ఎ) మేము ఈ నిబంధనలను ఉల్లంఘించడం వలన కలగని నష్టాలు;

(బి) నిబంధనలను ఉల్లంఘించడం వలన Googleకి సహేతుక ముందస్తు పర్యవసానంగా మీతో సంబంధిత ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో సంభవించని ఏదైనా వ్యయం లేదా నష్టం; లేదా

(సి) కోల్పోయిన లాభాలు, రాబడులు, అవకాశాలు లేదా డేటాతో సహా మీ ఏదైనా వ్యాపారానికి సంబంధించిన నష్టాలు.

ఏవైనా సూచిత వారెంటీలతో సహా ఈ నిబంధనల కింద సంభవించే ఏవైనా క్లెయిమ్‌ల కోసం Google, అలాగే దాని సరఫరాదారులు మరియు పంపిణీదారుల పూర్తి బాధ్యత మీరు సేవలను ఉపయోగించడం (లేదా క్లెయిమ్‌లోని ప్రధానాంశం ఉచిత సేవ అయితే, మీకు సేవలను మళ్లీ అందించడం) కోసం మాకు చెల్లించిన మొత్తానికి పరిమితం చేయబడుతుంది.

ఈ నిబంధనల్లో ఏదీ మరణం లేదా వ్యక్తిగత గాయాలు, మోసం, మోసం చేయాలనే ఉద్దేశంతో తప్పుగా సూచించడం లేదా చట్ట ప్రకారం మినహాయించబడని ఏదైనా బాధ్యత కోసం Google, అలాగే దాని సరఫరాదారులు మరియు పంపిణీదారుల బాధ్యతను మినహాయించడానికి లేదా పరిమితం చేయడానికి ఉద్దేశించబడలేదు.

11. నిబంధనలను నిర్వహిస్తున్న చట్టాలు.

మీరు యూరోపియన్ ఆర్థిక మండలి లేదా స్విట్జర్లాండ్ వెలుపల నివసిస్తుంటే, ఈ నిబంధనలు లేదా Google డిస్క్ వలన వచ్చే లేదా వాటికి సంబంధించిన వివాదాలకు, కాలిఫోర్నియా వివాద చట్టాల నియమాలను మినహాయించి, కాలిఫోర్నియా, U.S.A. చట్టాలు వర్తిస్తాయి. ఈ నిబంధనలకు సంబంధించి లేదా వీటి కారణంగా ఏర్పడే అన్ని దావాలు శాంటా క్లారా కౌంటీ, కాలిఫోర్నియా, USAలోని సమాఖ్య లేదా రాష్ట్ర న్యాయస్థానాలలో ప్రత్యేకంగా విచారించబడతాయి మరియు ఆ న్యాయస్థానాల వ్యక్తిగత న్యాయ పరిధికి మీరు మరియు Google కట్టుబడి ఉండాలి.

మీరు యూరోపియన్ ఆర్థిక మండలి లేదా స్విట్జర్లాండ్లో నివసిస్తుంటే, ఈ నిబంధనలు లేదా Google డిస్క్ కారణంగా ఏర్పడే లేదా వాటికి సంబంధించిన ఏవైనా వివాదాలకు మీరు నివసించే దేశంలోని చట్టాలు మరియు న్యాయస్థానాలు వర్తిస్తాయి మరియు మీరు మీ స్థానిక న్యాయస్థానాల్లో న్యాయ విచారణలను జరపవచ్చు.ఆన్‌లైన్ పరిష్కారం కోసం వివాదాలను ఐరోపా సంఘం ఆన్‌లైన్ వివాద పరిష్కార ప్లాట్‌ఫారమ్‌‌లో సమర్పించవచ్చు.

12. ఈ నిబంధనల గురించి

Google డిస్క్ లేదా చట్టం, పద్ధతి లేదా రాజకీయ లేదా ఆర్థిక విధానానికి చేసిన మార్పులను చూపడం; లేదా నియంత్రకాలు లేదా సంబంధిత పరిశ్రమ సంస్థల ద్వారా జారీ చేయబడిన మార్గదర్శకాలకు ప్రతిస్పందనగా; లేదా Googleని దాని బాధ్యతలు నెరవేర్చడానికి అనుమతించడం వంటి వాటి కోసం మేము ఈ నిబంధనలు లేదా Google డిస్క్‌కు వర్తించే ఏవైనా అదనపు నిబంధనలకు సవరణలు చేయవచ్చు. కాబట్టి మీరు నిబంధనలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. మేము ఈ పేజీలో ఈ నిబంధనల సవరణలకు సంబంధించిన నోటీసును పోస్ట్ చేస్తాము. మేము సవరించిన అదనపు నిబంధనలకు (“అదనపు నిబంధనలు”) సంబంధించిన నోటీసును Google డిస్క్‌లో పోస్ట్ చేస్తాము మరియు నిబంధనలకు చేసే ప్రధాన మార్పుల గురించి మీకు ముందస్తు నోటీసును అందిస్తాము. మార్పులు గత సమయానికి వర్తించవు మరియు వాటి గురించి మీకు పోస్ట్ చేసిన లేదా తెలియజేసిన 14 రోజుల తర్వాత ప్రభావంలోకి వస్తాయి. అయితే, మార్పులు కొత్త కార్యకలాపాలు లేదా లక్షణాలకు (“కొత్త సేవలు”) సంబంధించిన మార్పులు లేదా చట్టపరమైన కారణాల దృష్ట్యా చేసిన మార్పులు వెంటనే ప్రభావంలోకి వస్తాయి. మీరు కొత్త సేవ యొక్క సవరించిన నిబంధనలకు అంగీకరించని పక్షంలో, ఆ కొత్త సేవను వినియోగించడాన్ని ఆపివేయాలి (మరింత సమాచారం కోసం ఎగువన “శాశ్వత నిలిపివేత” విభాగాన్ని చూడండి).

ఈ నిబంధనలు మరియు అదనపు నిబంధనల మధ్య వైరుధ్యం ఏర్పడిన పక్షంలో, ఆ వైరుధ్యానికి సంబంధించి అదనపు నిబంధనలు నియంత్రిస్తాయి.

ఈ నిబంధనలు Googleకు మరియు మీకు మధ్య సంబంధాన్ని నియంత్రిస్తాయి. అవి మూడవ పక్ష లబ్దిదారు హక్కులు ఏవీ సృష్టించవు.

మీరు ఈ నిబంధనలకు అనుగుణంగా లేకపోతే మరియు మేము వెంటనే చర్య తీసుకోకుంటే, దీనర్థం మేము కలిగి ఉన్న ఏవైనా హక్కులను (భవిష్యత్తులో చర్య తీసుకోవడం వంటివి) వదులుకుంటున్నట్లు కాదు.

నిర్దిష్ట నిబంధన అమలు చేయదగినది కాకపోతే, దాని ప్రభావం వేరే ఏ ఇతర నిబంధనలపైనా ఉండదు.

Googleని ఎలా సంప్రదించాలనే దాని గురించి సమాచారం కోసం, దయచేసి మా సంప్రదింపు పేజీ ని సందర్శించండి.