మీ బిజినెస్ లోపల, బయట ఎలా ఉంటుందో చూపించండి
ఫోటోలు, వర్చువల్ వీక్షణలు అనేవి వ్యక్తులు ఒక బిజినెస్‌ను సందర్శించాలా వద్దా అని నిర్ణయించుకోవడంలో సహాయపడతాయి. ఆన్‌లైన్‌లో ఉన్న మీ సమాచారాన్ని విస్తృతం చేయండి, ఇన్‌డోర్‌తో పాటు అవుట్‌డోర్‌లో మీ బిజినెస్‌ను ఉత్తమంగా చూపించండి. మీ కస్టమర్లు వాస్తవంగా మీ బిజినెస్‌ను సందర్శించడం కంటే ముందు Street View ఇమేజ్‌లను బ్రౌజ్ చేస్తూ ఏమి తెలుసుకోవచ్చు అన్నది వివరించండి.
100+
Street Viewలో దేశాలు, ప్రాంతాలు
100 కోట్లు+
Google Mapsలో నెలవారీ యూజర్‌లు
20 కోట్లు+
Google Mapsలో లిస్ట్ చేయబడిన బిజినెస్‌లు, స్థలాలు
మీ స్టోర్ ముందు భాగానికి సంబంధించిన 360 డిగ్రీ వీక్షణతో ఏమి తెలుసుకోవచ్చు అన్నది వివరించండి
మీ లొకేషన్‌కు వచ్చే సందర్శకులను గైడ్ చేయడానికి మీ సొంత అవుట్‌డోర్ ఇమేజ్‌లను క్రియేట్ చేయండి. పార్కింగ్ ఎక్కడ చేయవచ్చు లేదా చక్రాల కుర్చీ వెళ్ల గల సౌకర్యం ఉందా లాంటి ముఖ్యమైన సమాచారాన్ని వారికి చూపండి.
వర్చువల్ వీక్షణతో మీ బిజినెస్‌ను ప్రత్యేకంగా నిలబెట్టండి
మీ కస్టమర్లు వాస్తవంగా మీ బిజినెస్‌ను సందర్శించడం కంటే ముందు Street View ఇమేజ్‌లను బ్రౌజ్ చేస్తూ ఏమి తెలుసుకోవచ్చు అన్నది వివరించండి. మీ ఫెసిలిటీస్‌కు, ప్రోడక్ట్ షెల్ఫ్‌లకు, మెనూలకు సంబంధించిన ఫోటోలను క్యాప్చర్ చేయండి. వాటిని Street Viewలో మీ అంతట మీరు గానీ, లేదా నిపుణుల సహాయంతో గానీ పబ్లిష్ చేయండి.
మీ వర్చువల్ వీక్షణను క్రియేట్ చేయండికొత్త ఇమేజ్‌లను అప్‌లోడ్ చేస్తూ సందర్శకులు తిరిగి వచ్చేలా చేయండి
మీరు ఇప్పుడే రీమోడల్ చేయడం పూర్తి చేశారా లేదా కొత్త ప్రోడక్ట్‌లను అందించడం ప్రారంభించారా? మీ ఫోటోలను Street Viewలో అప్‌డేట్ చేయండి. కొత్త మార్పుల గురించి, ఆసక్తిని రేకెత్తించే ఆఫర్‌ల గురించి మీ కస్టమర్‌లకు క్రమం తప్పకుండా తెలియజేయండి, తద్వారా ఆన్‌లైన్‌లో మీ బిజినెస్‌కు ఉన్న ఇమేజ్‌ను పెంచుకోండి.