ఒక సరదా హాబీ నుండి ప్రపంచం ముంగిటకు - ఫ్రెంచ్ పాలినీషియా అందాన్ని మ్యాపింగ్ చేయడం వల్ల అక్కడి స్థానిక ప్రజలకు ఎనలేని లాభం చేకూరింది.

ఫ్రెంచ్ పాలినీషియా - తెల్లని ఇసుక బీచ్‌లు, రోలింగ్ హైకింగ్ ట్రెయిల్స్, UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాలు కలిగిన ఈ ప్రాంతం, జీవితంలో ఒకసారి అయినా చూడాల్సిన ప్రముఖ పర్యాటక ప్రదేశం. కొంతమంది దీని గురించి కలలు కనడంలో బిజీగా ఉంటే, క్రిస్టొఫే కౌర్‌కాడ్ మాత్రం ఈ భూతల స్వర్గాన్ని ప్రజలకు చేరువ చేయడానికి ఒక గొప్ప అవకాశం లభించిందని భావించారు. Street View ద్వారా తాహితీ పర్యాటక రంగం వృద్ధి చెందేలా చేయడానికి సహకారం అందించారు.

1,800కి.మీ.

ఫోటో తీశారు

1,200,000

ఇమేజ్‌లు

వయా

8K

రిజల్యూషన్ వీడియోలను ప్రదర్శించండి

8+

ద్వీపాలు

18

పబ్లిష్ అయిన హోటళ్లు

+450

బిజినెస్ లిస్టింగ్‌లు
క్రియేట్ చేయబడ్డాయి

బిజినెస్‌ను, ఆనందాన్ని సమ్మిళితం చేయడం

Street View పట్ల, అలాగే అద్భుతమైన అందాలతో అలరారుతున్న ఫ్రెంచ్ పాలినేషియా ద్వీపాల పట్ల తనకు ఉన్న అమితమైన ఇష్టంతో క్రిస్టొఫే 2019లో 'తాహితీ 360' కంపెనీని ప్రారంభించారు. హైకింగ్ ట్రెయిల్‌లు, బీచ్‌లతో పాటు ఫ్రెంచ్ పాలినేషియాలోని పెద్దపెద్ద బహిరంగ ప్రదేశాలను ఫోటోలు తీసి వాటి 360 ఇమేజరీని Street Viewలో అప్‌లోడ్ చేయడంలో ఈ కంపెనీ ప్రత్యేకత సాధించింది. ఇంకా, ఓ పక్క ఈ దీవుల్లోని అందమైన జీవితాన్ని క్యాప్చర్ చేసి దానిని ప్రదర్శించడంపై ప్రధానంగా దృష్టి పెడుతూనే, మరోవైపు 'ఇమ్మెర్సివ్ Street View ఇండోర్ వర్చువల్ వీక్షణల'తో లోకల్ బిజినెస్‌లు మరింత విజిబిలిటీని సాధించడానికి కూడా క్రిస్టొఫే సాయం చేస్తుంటారు.

ఫ్రెంచ్ పాలినేషియా మ్యాపింగ్

దాదాపు ప్రతి అంశం డిజిటల్‌గా మారిపోయిన ఈ తరుణంలో, క్రిస్టొఫే, అలాగే తాహితీ 360లు ద్వీపంలోకి అడుగుపెట్టే నాటికి ఫ్రెంచ్ పాలినేషియా ప్రాంతాలకు సంబంధించి కేవలం ఉపగ్రహ వీక్షణలు మాత్రమే అందుబాటులో ఉన్నాయంటే నమ్మడం ఒకింత కష్టం. దీనికి తోడు బోరా బోరా, తాహితీ లాంటి దీవుల్లోని వీధులకు ఎలాంటి పేర్లూ లేకపోవడం సమస్యను మరింత సంక్లిష్టం చేసింది. ఈ అంశం, ఆ దీవులను సందర్శించాలనుకునే స్థానికులతో పాటు పర్యాటకులకు కూడా ఒక సవాల్‌గా ఉండేది. మరీ ముఖ్యంగా, దీనివల్ల అగ్నిమాపక దళం, ఎమర్జెన్సీ సహాయక సిబ్బంది, చట్టాలను అమలు చేసే అధికారుల లాంటి ఎమర్జెన్సీ సర్వీసుల విధి నిర్వహణ క్లిష్టంగా ఉండేది.

 

Street Viewకి లోకల్ కమ్యూనిటీలకు గొప్ప ప్రయోజనాలు అందించే శక్తి ఉందని నేను ఎప్పుడూ నమ్మాను. ఒక నిర్దిష్ట ప్రాంతంలో మీ గురించి మీరు చెప్పుకునే సామర్థ్యం, మీ ఇంటిని విడిచి బయటకు రావడానికి ముందే మీ పరిసరాల గురించి అవగాహన తెచ్చుకోవడం అన్న అంశాలు నాకెంతగానో ఉత్సాహానిచ్చేవి. ఇది, ప్రత్యేకించి ఫ్రెంచ్ పాలినీషియా లాంటి ప్రాంతంలో ఎంతో ఉపయోగకరంగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మీరు వెళ్లే దారిలో సులభంగా నావిగేట్ చేయడం అన్నది దాదాపుగా అసాధ్యంగా ఉంటుంది.

-

క్రిస్టొఫే కౌర్‌కాడ్, తాహితీ 360 వ్యవస్థాపకులు

 

Google Street View బోరా బోరా మ్యాపింగ్

ద్వీప జీవితానికి Street View అందించగల ప్రయోజనాలను గుర్తించిన స్థానిక అధికార సంస్థలు, మూరియా, బోరా బోరా, రైయాతియా, మౌపితి, హువాహైన్, ఫాకారావా, రాంగీరోవాలోని అన్ని రహదారులను మ్యాపింగ్ చేయడం, అలాగే రెఫరెన్స్‌లుగా చేసేందుకు తాహితీ 360 కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరచుకున్నాయి. ఫ్రెంచ్ పాలినేషియాలోని 1,800 కి.మీ. ప్రాంతాన్ని కవర్ చేయడానికి క్రిస్టొఫే, ఆల్ టెర్రయిన్ వెహికల్స్, గోల్ఫ్ కార్ట్‌లు, ఎలక్ట్రిక్ బైక్‌లు, జెట్ స్కీలను, చివరకు గుర్రాలను కూడా ఉపయోగించారు. క్రిస్టొఫే చేసిన కవరేజీకి, అలాగే అధికార వర్గాలు అందించిన భౌగోళిక డేటాకు ధన్యవాదాలు. దీని కారణంగా Google Maps ద్వారా తాహితీలో ప్రస్తుతం లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లు, అత్యంత వేగవంతమైన మార్గాల సూచనలు, లోకల్ బిజినెస్‌లకు వెళ్లే దారి తెలుసుకోవడం సాధ్యమవుతోంది. దీనివల్ల, ప్రత్యేకించి ద్వీపంలోని అన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సర్వీసులు అందించేవారు మరింత ప్రభావవంతంగా సేవలను అందించడానికి అవకాశం ఏర్పడుతోంది. చివరిగా, Street Viewలోని తాహితీ 360 ఇమేజ్‌లకు యాక్సెస్ పొందడం అన్నది పట్టణ ప్రణాళిక, భవనాలను, రోడ్ల స్థితిగతులను మెయిన్‌టెయిన్ చేయడం లాంటి పనులను సులభతరం చేసింది.

UNESCO ప్రపంచ వారసత్వ స్థలంలోకి యాక్సెస్ పొందండి

తాహితీ 360 లో మంత్రముగ్గులను చేసే పర్యటన ఏది అంటే రైయాతియా ద్వీపంలోని తపూతాపువాతియా అని చెప్పవచ్చు. ఫ్రెంచ్ పాలినేషియాకు ప్రతి సంవత్సరం 300,000 మంది సందర్శకులను తీసుకురావడంలో 'UNESCO ప్రపంచ వారసత్వ ప్రాంతం' ముఖ్య పాత్రను పోషిస్తోంది. అయితే, దాని అందాలను 360లో క్యాప్చర్ చేసి లక్షలాది మంది వర్చువల్ విధానంలో దానిని చూసే అవకాశం క్రిస్టొఫే కల్పించారు. ఎంతో నైపుణ్యంతో క్రిస్టొఫే చేసిన ఈ పని, Street Viewలో పబ్లిష్ అవడం వల్ల, ఈ ప్రపంచ అద్భుతం మన స్క్రీన్‌ల మీదకు వచ్చింది. ఫలితంగా మనం దాన్ని అన్వేషించగలుగుతున్నాం.

యావత్ ద్వీపాన్ని కవర్ చేయడమంటే చిన్న విషయం కాదు, కానీ క్రిస్టొఫే ఆ సవాల్‌ను అధిగమించారు. బోరా బోరాలోని అన్నింటినీ క్యాప్చర్ చేసి 360లో అందించేందుకు, ఆయన ఆ ద్వీపంలో కారు, పడవలతో పాటు కాలి నడకన కూడా ప్రయాణించారు. యావత్ ద్వీపాన్ని మ్యాప్ చేసి దానిని అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేసి Street Viewలో దానిని అనుభూతి చెందేలా చేయడానికి క్రిస్టొఫేకు ఏడు రోజులు పట్టింది.

బోరా బోరాతో పాటు, క్రిస్టొఫే తాహితీ రాజధాని పపీతీ అలాగే పైరేపట్టణంలోని వీధులన్నింటినీ ఫోటోలు తీశారు. ఆ రెండు పట్టణాల ఇమేజ్‌లు Street Viewలో కనిపించినప్పుడు వాటి విజిబిలిటీ కోసం పడిన కష్టానికి ఫలితం దక్కింది.

లోకల్ బిజినెస్‌లు కూడా Street Viewలో పాపులర్ అయ్యే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి. ఇంటర్‌కాంటినెంటల్, మనావా, హిల్టన్ లాంటి పెద్ద హోటల్ గ్రూపులు, అలాగే చిన్నస్థాయి B&B బిజినెస్‌లు కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నాయి. ఎందుకంటే వారి వద్ద ఉన్న ఫెసిలిటీస్‌ని ప్రపంచానికి చూపడానికి మంచి అవకాశం లభించింది.

బకెట్ లిస్ట్‌కు మరిన్నింటిని జోడించడం

ఈ సంవత్సరం చివరి నాటికి ఫ్రెంచ్ పాలినేషియాలోని అన్ని దీవులను కవర్ చేయాలని తాహితీ 360 భావిస్తోంది. మౌపితీ, తహా, మార్క్యూసాస్ దీవులు, గ్యాంబ్లర్స్ ఐలాండ్స్, ఆస్ట్రాల్ ఐలాండ్‌లను ఇంకా కవర్‌ చేయాల్సి ఉంది. ఫ్రెంచ్ పాలినేషియాలో ఇంకా చాలా ప్రాంతం కవర్ చేయాల్సి ఉన్నప్పటికీ, క్రిస్టొఫే ఇప్పటి నుండే తను ఆ తర్వాత చేయాల్సిన సాహసం గురించి ఆలోచిస్తున్నారు. తన స్వంత పట్టణంలోని 400 కి.మీ. సైక్లింగ్ పాత్‌లు, ఏమియెన్స్‌లోని హార్టీల్లినోజెస్, సొమ్మే టూరిజం కోసం పర్యాటక రైలు ప్రాంతాలను కవర్ చేసేందుకు ఆయన ఇప్పటికే స్థానిక ఫ్రెంచ్ అధికారిక సంస్థలతో కలిసి పని చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 2024 ఒలింపిక్ గేమ్స్‌లో సర్ఫింగ్ ఈవెంట్లకు ఆతిథ్యం ఇచ్చే తియాహుపూను కూడా క్రిస్టొఫే కవర్ చేస్తారు. ఈ మధ్యలో ఆయన న్యూ కాలెడోనియా, వాలీస్, ఫ్యుతూనా ఐల్యాండ్‌లను Street Viewకు జోడించాలని ఆశిస్తున్నారు. తద్వారా స్థానికుల రోజువారీ జీవితాన్ని మెరుగుపరిచి, ఈ స్వర్గధామాన్ని మరింత మంది అన్వేషించేలా చేయడంలో సాయపడాలని ఆశిస్తున్నారు.

Street View అనేది, Google Mapsలో ఆకట్టుకొనే ఇమేజ్‌లను పబ్లిష్ చేయడం ద్వారా కమ్యూనిటీలు వృద్ధి చెందేందుకు, బిజినెస్‌లు ఎదిగేందుకు, ప్రపంచ అద్భుతాలను మరింతగా మన ఇంట్లోకి తీసుకువచ్చేందుకు కంట్రిబ్యూటర్లు సాయం చేయగల ఒక సహకార ప్లాట్‌ఫామ్. అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే, Street Viewతో ఎవరైనా సరే తాము సాధించిన విజయాన్ని మ్యాపింగ్ చేయొచ్చు. ఇందుకు కావల్సిందల్లా నెటిజన్లకు సాయం చేయాలన్న సంకల్పంతో తొలి అడుగు వేయడమే.

మరిన్ని అన్వేషించండి

మీ స్వంత Street View ఇమేజ్‌లను షేర్ చేయండి