Street Viewతో జాంజిబార్‌లోని స్థానిక కమ్యూనిటీలను చైతన్యపరచడం

తమ ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసుకోవడానికి పర్యాటక రంగంపై ఆధారపడే ఏ పర్యాటక గమ్యస్థానం అయినా, తన గురించిన అంతర్జాతీయ అవగాహనను పెంపొందించుకోవడానికి ప్రాధాన్యతను ఇస్తుంది. ఆ విషయంలో జాంజిబార్ అతీతమేమీ కాదు. కాబట్టి తమ దేశంపై ఆర్థిక ప్రభావాన్ని క్రియేట్ చేసే విషయంలో, జాంజిబార్ ప్లానింగ్ కమీషన్, తమ ద్వీపసమూహపు అందాన్ని ప్రదర్శించాలని నిశ్చయించుకుంది. – అందుకు Street View వారికి సహాయపడింది. వరల్డ్ ట్రావెల్ ఇన్ 360 (WT360)కు చెందిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఫెడరికో డిబెట్టో, నికోలే ఓమ్లేచెంకో, క్రిస్ డూ ప్లెస్సీస్‌తో కలిసి, వారు ప్రాజెక్ట్ జాంజిబార్‌ను ప్రారంభించి, లోకల్ కమ్యూనిటీలను వారి స్వంతంగా ప్రాజెక్ట్‌ను కొనసాగించడానికి ప్రేరేపించారు.

జాంజిబార్‌లోని లోకల్ కమ్యూనిటీలను చైతన్యపరుస్తున్న Google Street View

Watch the film

Link to Youtube Video (visible only when JS is disabled)

1,700 కి.మీ.

ఫోటోల ద్వారా క్యాప్చర్ చేసిన దూరం

980 వేలు

పబ్లిష్ చేయబడిన ఇమేజ్‌ల సంఖ్య

33 కోట్లు

వీక్షణలు

105 హోటల్స్

లిస్ట్ చేయబడినవి

అందరూ కలిసి అభివృద్ధిని ప్రోత్సహించడం

పెద్ద స్థాయిలో మ్యాపింగ్ చేయడం కష్టంతో కూడుకున్న పని. కాబట్టి WT360 టీమ్ జాంజిబార్ స్టేట్ యూనివర్సిటీ నుండి పన్నెండు మంది విద్యార్థి వాలంటీర్‌లతో కలిసి ఉంగుజాకు చెందిన అందమైన ద్వీపాన్ని మ్యాప్ చేయడంలో సహాయపడింది. ఫెడరికో, నికోలే, క్రిస్‌ల నైపుణ్యం ద్వారా వారు 1,700 కిలోమీటర్‌ల ఫుటేజ్‌ను క్యాప్చర్ చేశారు.

మా GDPకి, పర్యాటక రంగం 30% కంటే ఎక్కువ దోహదపడుతుంది. ఫలితంగా, మేము మా యువతకు, ఇప్పటికే పర్యాటక పరిశ్రమలో పని చేస్తున్న వారికి శిక్షణ ఇవ్వగలుగుతున్నాము. ప్రజలు పర్యాటక రంగాన్ని హోటళ్లకు సంబంధించినదిగా భావించిన సందర్భాలు ఉన్నాయి. పర్యాటక రంగం దాని కంటే ఎక్కువ. పర్యాటక రంగంలో చరిత్ర, విమానయాన సంస్థలు, మార్కెటింగ్ అంశాలు ఉంటాయి. జాంజిబార్ నుండి ఎక్కువ మంది వ్యక్తులు ఈ పరిశ్రమలో చేరడం ప్రభుత్వానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

-

జాంజిబార్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి సిమై మొహమ్మద్ సయ్యద్.

జాంజిబార్ అభివృద్ధి చెందుతున్నప్పుడు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహాయపడటానికి, దేశానికి కొత్త సందర్శకులను ఆకర్షించడానికి, ఫెడరికో టీమ్ స్థానిక వీధుల 360 ఇమేజ్‌లను క్రమం తప్పకుండా రిఫ్రెష్ చేసేవారు.

జాంజిబార్‌లోని ఫెబెరికో డెబెట్టో నుండి Google Street View స్ట్రీట్ ఫోటో

360 ఇమేజరీతో ప్రపంచవ్యాప్తంగా బిజినెస్‌లను విస్తరింపజేయడం

ఈ సంవత్సరం ప్రారంభంలో, ఫెడెరికో ఉత్తర ద్వీపం పెంబాను అన్వేషించడం ప్రారంభించారు. కేవలం 6 రోజులలో, ఫెడరికో, ఇబ్రహీం ఖలీద్, మాజీ విద్యార్థి వాలంటీర్ 500 కిలోమీటర్‌ల మేర ఇమేజ్‌లను, 40 ఏరియల్ పనోరమాలను క్యాప్చర్ చేశారు, వాతిని వారు Street View Studioను ఉపయోగించి Google Mapsకు అప్‌లోడ్ చేశారు.

పర్యాటక ఆకర్షణలు, వారసత్వ ప్రదేశాలు, హోటళ్లు, బిజినెస్‌కు చెందిన ఖచ్చితమైన ఫుటేజ్‌తో వారు జాంజిబార్ నేషనల్ గ్లోబల్ టూర్‌ను క్రియేట్ చేయగలిగారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ద్వీపాలను ప్రమోట్ చేసే ఇమేజరీ ప్లాట్‌ఫామ్.

మ్యాపింగ్ నుండి ఉద్యోగాలను క్రియేట్ చేసే వరకు

ఫెడరికో మొదటిసారి షమీము యాసిన్‌ను కలిసినప్పుడు, ఆమె డ్రోన్ పైలట్ కావాలనే లక్ష్యం గల విద్యార్థి. జాంజిబార్ భవిష్యత్తును మెరుగుపరచాలనే నిబద్ధతతో, షమీము Street View సాంకేతికత గురించి తెలుసుకోవడానికి WT360 టీమ్‌ను ఆశ్రయించారు. ఆమెకు ఉత్తమ కెమెరాను ఉపయోగించడం, ఇమేజ్‌లను ఎలా క్యాప్చర్ చేయాలి, వాటిని Google Mapsకు ఎలా అప్‌లోడ్ చేయాలి అనేవి నేర్పించారు. తక్కువ సమయంలోనే షమీము ఈ నైపుణ్యాలలో ప్రావీణ్యం సంపాదించి, జీవనోపాధి కోసం జాంజిబార్ దీవులను అన్వేషించడం, మ్యాపింగ్ చేయడం ద్వారా వృత్తిపరమైన ఫోటోగ్రాఫర్‌గా మారారు.

ఫెడరికో, షమీము, ఇబ్రహీం ప్రస్తుతం జాంజిబార్ యొక్క కొత్త ఏరియల్ ఇమేజ్‌లను అప్‌లోడ్ చేయడానికి పనిచేస్తున్నారు, తాజాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు, కొత్త బిజినెస్‌లు, పునర్నిర్మించిన హోటల్స్‌పై దృష్టి సారించారు. అలాగే జాంజిబార్ అమ్యూజ్‌మెంట్ పార్క్‌ను ప్రారంభించడం ద్వారా, వారి లక్ష్యం పెరుగుతూ వచ్చింది.

జాంజిబార్‌లో స్కేల్‌లో మ్యాపింగ్: Street View Studioతో స్మార్ట్, వేగవంతమైన డేటా పబ్లిషింగ్

ఇమేజ్, కెమెరా నాణ్యత 2019 నుండి మెరుగుపడింది, Street View Studio లాంచ్‌తో ఇమేజరీ పబ్లిషింగ్ సులభంగా, వేగంగా మారింది. ఫోటోగ్రాఫర్‌లు ఒకే సమయంలో పలు 360 వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు, ప్రోగ్రెస్‌ను పర్యవేక్షించవచ్చు, స్థలం లేదా ఒరిజినల్ ఫైల్ పేరు ద్వారా అప్‌లోడ్ చేయబడిన మెటీరియల్ కోసం సెర్చ్ చేయవచ్చు, ఇంటరాక్టివ్ మ్యాప్ లేయర్‌లను ఉపయోగించి వారి భవిష్యత్తు సేకరణల కోసం ప్లాన్ చేయవచ్చు.

 

మేము Street View Studioను ఉపయోగించి పెంబా ద్వీపం మొత్తాన్ని పబ్లిష్ చేశాము. ఈ టూల్‌కు సంబంధించిన ప్రధాన మెరుగుదలలు సంస్థ-ఆధారితమైనవి. ఉదాహరణకు, పాజ్ చేయబడిన లేదా అంతరాయం కలిగిన అప్‌లోడ్‌లను కొనసాగించగలడం, కొత్త ఫైల్స్‌ను జోడించడానికి రాత్రిపూట మేల్కొనే అవసరం లేకుండా అనేక వీడియోలను ఒకేసారి అప్‌లోడ్ చేయడం వంటివి. ఇది మాకు చాలా సమయాన్ని ఆదా చేసింది!

-

ఫెడరికో డిబెట్టో వృత్తిపరమైన ఫోటోగ్రాఫర్

 

భవిష్యత్తును నిర్మించడం

ప్రాజెక్ట్ జాంజిబార్ అనేది స్థానిక విద్యార్థులను వారి దేశాన్ని మ్యాపింగ్ చేయడానికి చైతన్యపరిచేందుకు, అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రారంభించబడింది, అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. మూడు సంవత్సరాల్లో, ఈ ప్రాజెక్ట్ లోకల్ బిజినెస్‌ను తెరపైకి తెచ్చి, షమీము, ఇబ్రహీం వంటి మాజీ వాలంటీర్‌లకు కెరీర్ అవకాశాలను కల్పించింది.

మరిన్ని అన్వేషించండి

మీ స్వంత Street View ఇమేజ్‌లను షేర్ చేయండి