ఒక్క వీధి వీక్షణ ఇమేజ్‌తో ఫిన్‌లాండ్ వ్యాప్తంగా ఏకకాలంలో రహదారి నిర్వహణకు సంబంధించి అటోరీ ఏ విధంగా విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

రోడ్ల పైభాగం నాణ్యత, కాలం చెల్లిన రోడ్డు సంకేతాలు, లైట్లు లేని వీధులు అనేవి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డ్రైవర్లకు, మునిసిపాలిటీలకు నిత్యం ఒక సమస్యగా ఉన్నాయి. అయితే, మౌలిక సదుపాయాల నిర్వహణ సమస్యలకు సొల్యూషన్లను డెవలప్ చేసే Autori అనే కంపెనీ, Google Maps Street View ద్వారా వీధులలోని డేటాను సేకరించి, మరింత ప్రభావవంతంగా విశ్లేషించడానికి ఒక కొత్త విధానాన్ని కనిపెట్టింది ఈ ఫిన్‌లాండ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ, Autori.

40,000 కి.మీ.

ఫోటో తీశారు

8 మిలియన్

ఇమేజ్‌లు పబ్లిష్ చేశారు

50 మిలియన్

వీక్షణలు

రోడ్ డేటా

20

ప్రాజెక్ట్‌లను క్యాప్చర్ చేయడం

ఫిన్‌లాండ్‌లో రహదారుల నిర్వహణను క్రమబద్ధీకరించడం

Autori సంస్థ 1988లో స్థాపించబడింది. ఇది, కండీషన్ మేనేజ్‌మెంట్, యాక్షన్ ప్లాన్, మెయింటైనెన్స్ కోఆర్డినేషన్ అంశాల్లో ఫిన్‌లాండ్ రహదారులను నిర్వహించే అధికారిక సంస్థలకు, కాంట్రాక్టర్లకు, అలాగే థర్డ్-పార్టీ కన్సల్టెంట్లకు సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ (SaaS) సొల్యూషన్లను అందిస్తోంది. మొత్తం దేశంలో రోడ్ల స్థితిగతులను పర్యవేక్షించాలంటే చాలా సమయం పడుతుంది. అలాగే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. ఈ పర్యవేక్షణ ఇతర కంపెనీలకు ఖర్చుతో కూడుకున్నది కావచ్చు గానీ, Autori మాత్రం దీన్నొక చక్కటి అవకాశంగా భావించి తద్వారా లాభపడింది. తమ స్వంత Street View ఇమేజ్‌లను, అలాగే SaaS సొల్యూషన్‌ను ఉపయోగించి, ఫిన్‌లాండ్‌లో రహదారుల నిర్వహణకు సంబంధించిన మౌలిక సదుపాయాల డేటాను మెరుగ్గా నిర్వహించి, నిర్ణయాలు తీసుకోవడానికి ఆ సంస్థ వారు ఒక టూల్‌ను క్రియేట్ చేశారు.

పనుల్లో వేగం, డేటా షేరింగ్ అవసరం

సాధారణంగా అయితే, రోడ్లను నిర్వహించే అధికారిక సంస్థలు, నిర్దిష్టమైన లొకేషన్లలోని ప్రతి రోడ్డును స్వయంగా సందర్శించి, ఆ రోడ్డుకు ఏ రకమైన మరమ్మతులు చేయాలన్నది తెలుసుకోవలసి ఉంటుంది. అంటే ఏమిటంటే, వేలాది కిలోమీటర్లు డ్రైవ్ చేసి, చాలా చోట్ల ఆగి నోట్స్ రాసుకోవాలన్న మాట. ఇది పర్యావరణానికి చెడు చేయడమే కాదు, దీనికి ఎంతో ఖర్చు అవుతుంది, అలాగే చాలా మంది ఉద్యోగులు ఇందులో పని చేయాల్సిరావడం, ఇంకా అమితమైన సమయాన్ని వెచ్చించవలసి ఉండటం లాంటి సమస్యలు ఇందులో ఉన్నాయి. ఇందువల్ల, డిజిటల్‌గా, పర్యావరణానికి మరింత అనుకూలంగా ఉన్న సొల్యూషన్ అవసరం. ఈ పాయింట్ Autoriని సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించేలా చేసింది. అలా వైవిధ్యంగా ఆలోచించేటప్పుడు వీధుల స్థాయిలో మొదటి విజువలైజేషన్ సొల్యూషన్‌గా Street View గుర్తొస్తుంది.

 

రహదారుల నిర్వహణ కోసం తరచుగా పలు విభిన్నమైన పార్టీలతో భారీ స్థాయిలో డేటాను షేర్ చేయాల్సి ఉంటుంది. సమాచారాన్ని మరింత సులభంగా యూజర్‌ల మధ్య షేర్ చేసుకోవడానికి అవసరమైన టూల్స్ అన్నీ Street Viewలో ఉన్నాయి - స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది అందుబాటులో ఉంది. దీని కోసం ఎటువంటి లాగిన్‌లు లేదా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్‌లు అవసరం లేదు. ఇంతకు ముందు Street Viewను రహదారుల నిర్వహణ కోసం ఉపయోగించినప్పటికీ, డేటాను అప్‌డేట్‌గా ఉంచడమనేది అతిపెద్ద సవాలుగా ఉండేది. Street Viewను, మా రహదారుల నిర్వహణ సాఫ్ట్‌వేర్‌తో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఆ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉందనే విషయాన్ని మేము గుర్తించాము.

-

Autoriలోని డిజిటలైజేషన్ కన్సల్టింగ్ విభాగాధిపతి, అరీ ఇమ్మోనెన్

 

Google Street View Autori మ్యాప్‌లు ఫిన్‌లాండ్ రోడ్లు

రహదారుల భద్రత కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లను కలపడం

2017 తొలి నాళ్లలో, Autori ఫోటోలను తీయడం ప్రారంభించి ఫిన్‌లాండ్‌లోని జాతీయ రహదారుల 360 ఇమేజ్‌లను అప్‌లోడ్ చేసేది. తమ కంపెనీకి చెందిన Google ఖాతాను ఉపయోగించి ఆ ఇమేజ్‌లను పబ్లిష్ చేసేది. అప్పటి నుండి, వారు 40,000కి.మీ. జాతీయ రహదారులను కవర్ చేసి, 8 మిలియన్ల ఇమేజ్‌లను అప్‌లోడ్ చేయడం ద్వారా, రహదారుల నిర్వహణ మేనేజ్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చారు. Street Viewను, తమ SaaS సొల్యూషన్లతో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా రహదారులను నిర్వహించే అధికారిక సంస్థలు, రిమోట్ విధానంలో రోడ్ల తాజా అస్సెట్ సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయగలిగేలా చేశారు.

Street Viewలో Autori పబ్లిష్ చేసిన ఇమేజరీద్వారా, మిస్సయిన రోడ్డు సైన్ బోర్డులు, మార్కింగ్‌లు లేదా రోడ్లకు ఏర్పడిన గుంతలకు సంబంధించిన రిపోర్ట్‌లను అప్‌లోడ్ చేయవచ్చు. Autori డ్యాష్‌బోర్డ్ ద్వారా సంబంధిత అధికార వర్గాలు తమ ఆఫీస్ నుండే చెక్ చేయడానికి వీలుగా వాటిని ట్యాగ్ చేయవచ్చు. అనుకూలంగా మార్చుకోగల సొల్యూషన్‌ను అందించడం ద్వారా, అవసరమైన నిర్వహణ పనులను ట్రాక్ చేయడం, తగు ప్రణాళికను రూపొందించుకోవడం రెండింటినీ కాంట్రాక్టర్‌లకు ఒకే చోటు నుండి చేయడానికి కూడా Autori అనుమతిస్తుంది. నిర్వహణ పనులు పూర్తి అయ్యాక, రహదారుల డేటాను తాజాగా ఉంచడానికి ఉద్యోగులు ఆ ఏరియాకు చెందిన కొత్త 360 ఇమేజ్‌లు తీసి అప్‌లోడ్ చేస్తారు. ఈ పద్దతి, సైట్‌లను చెక్ చేయడానికి భౌతికంగా సందర్శించాల్సిన అవసరాన్ని తగ్గించింది - సమయాన్ని, డబ్బును ఆదా చేసింది. అలాగే గ్రీన్‌హౌజ్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించింది.

రహదారుల భద్రతలో అన్ని విధాలుగా విప్లవాత్మక మార్పులు తేవడం

ఫిన్‌లాండ్‌లోని రహదారులను నిర్వహించే అధికారిక సంస్థలు సులభంగా సమాచారాన్ని షేర్ చేసుకోవడం, అలాగే రోడ్లపై అవగాహన తెచ్చుకోవడం అనే అంశాలను మెరుగుపరిచేందుకు Autoriకి Street View చక్కటి అవకాశాన్ని కల్పించింది. తద్వారా ఖర్చులు తగ్గించుకోవడానికి, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సహాయపడింది. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా రోడ్ల పరిస్థితులను మెరుగుపర్చడానికి అవకాశం ఉందనే సంగతిని Autori గుర్తించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రహదారుల డేటా సేకరణ, షేరింగ్ కోసం ఒక ప్రామాణికరించిన మోడల్‌ను రూపొందించేందుకు Autori సిబ్బంది ప్రస్తుతం కృషి చేస్తున్నారు. అలాగే వారు 1,000 కి.మీ. సైక్లింగ్, పాదచారుల మార్గాలను ఫోటోలు తీశారు. దీని ద్వారా స్థానికంగా విడుదల అయ్యే కార్బన్ ఉద్గారాన్ని తగ్గించడానికి సాయపడ్డారు. ప్రజలు ఇప్పుడు తాజా డేటాను యాక్సెస్ చేయవచ్చు. పర్యావరణానికి మరింత అనుకూలంగా ఉండే విధంగా తక్కువ దూరం ఉండే ప్రయాణాలను చేయవచ్చు. ఇంతే కాకుండా, ఫిన్‌లాండ్‌లో అదనంగా మరో 15,000 కి.మీ. రహదారుల డేటాను సేకరించడానికి ఈ వేసవిలో వారు మరోసారి రోడ్ల పైకి రానున్నారు. దేశంలోని మొత్తం జాతీయ రహదారుల్లో దాదాపు సగం రోడ్ల ఫోటోలను తీసి Street Viewలో పబ్లిష్ చేయనున్నారు.

సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి బిజినెస్ సంస్థలు Street Viewను పలు వినూత్న విధానాల్లో ఉపయోగిస్తుండటానికి Autori విజయం ఒక ఉదాహరణ. ఇది కేవలం ఒక ఫోటో-మ్యాపింగ్ టూల్ మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. మీ బిజినెస్‌కు కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందించగలిగిన శక్తి దీనికుంది. మీరు కూడా ఒక Street View విజయగాథను సాధించి ప్రపంచానికి చాటాలనుకుంటున్నారా?

ఇందులో పోస్ట్ చేశారు:

మ్యాపింగ్ & డిజిటైజ్ చేయడం

మరిన్ని అన్వేషించండి

మీ స్వంత Street View ఇమేజ్‌లను షేర్ చేయండి