నలుదిక్కులా భూమి మాత్రమే ఉన్న దేశం ఇప్పుడు ప్రపంచానికి స్పష్టంగా కనిపిస్తోంది - Street View వలన ఒక బౌద్ధ రాజ్యం ప్రపంచానికి ఎలా పరిచయం అయింది.

హిమాలయ పర్వతాలలో నెలకొని ఉన్న దేశమైన భూటాన్, అనేక పర్వత మార్గాలకు, పచ్చదనంతో కళకళలాడే లోయలకు, ఇంకా నిర్మలమైన నదులకు పుట్టినిల్లు. అందుకనే ఈ జగమెరుగని అందాలను ప్రపంచానికి పరిచయం చేయాలని, అదే సమయంలో భూటాన్ పర్యాటక రంగానికి, ఇంకా సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఊతం అందించాలనే ఉద్దేశంతో భూటాన్ ప్రభుత్వం Street Viewతో పన్నెండు నెలల కార్యక్రమానికని భాగస్వామ్యం ఏర్పరచుకుంది.

ఆమోదాల విషయంలో, అలాగే చిత్రీకరణకు అనుమతుల విషయంలో అనేక ఆటంకాలను ఎదుర్కొన్నాక, భూటాన్ టూరిజం కౌన్సిల్, Google Singapore అందించిన టెక్నికల్ సపోర్ట్ సహకారంతో, మే 2020లో ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేయగలిగింది. వారి పని నిర్విరామంగా, సజావుగా సాగాలనే ఉద్దేశంతో, Street View వారికి రెండు Ricoh Theta Vలను, ఒక Insta360 Proను అందించి, ముఖాముఖి ట్రయినింగ్‌లను, అలాగే క్రమం తప్పకుండా పరిష్కార ప్రక్రియకు సంబంధించిన సెషన్‌లను ఆర్గనైజ్ చేసి సపోర్ట్ చేసింది.

2625.86 కి.మీ.

ఫోటోల ద్వారా క్యాప్చర్ చేసిన దూరం

2,398,285

పబ్లిష్ చేయబడిన ఇమేజ్‌ల సంఖ్య

74 లక్షలు

వీక్షణలు

భూటాన్ అందాలను డిజిటల్‌గా మ్యాప్ చేయడం

Street Viewతో భాగస్వామ్యం ఏర్పరచుకోక ముందు, భూటాన్ వద్ద, తమ దేశాన్ని సందర్శించాలనుకొనే వారితో కనెక్ట్ కావడానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యం కానీ లేదా సామాగ్రి కానీ ఉండేది కాదు, దానితో ట్రిప్‌లను ప్లాన్ చేసుకోవడం పర్యాటకులకు సవాలుగా ఉండేది. ఇప్పుడు, బౌద్ధ యాత్రికుల దగ్గర నుండి భూటాన్‌ను సందర్శించాలనుకునే పర్యాటకుల దాకా ఎవరైనా కానీ, థింపూలోని కోటల్లా ఉండే మఠాలయాలను, అలాగే పునాఖాలోని సహజత్వం ఉట్టిపడే పల్లెల అందాలను వర్చువల్‌గా చూసి ఆస్వాదించవచ్చు.

ప్రపంచానికి చేరువ అవ్వాలనే ప్రభుత్వ ప్లాన్‌లో భాగంగా ఇది ఒక మైలురాయి మాత్రమే కాదు, ICTని అందిపుచ్చుకొన్న సమాజం కావాలని భూటాన్ సాగించే డిజిటల్ ప్రయాణంలో భాగంగా ఒక కీలకమైన ముందడుగు కూడా.

భూటాన్‌ను ఎక్కువ మంది సందర్శించే మార్గం

Street View స్మార్ట్ నావిగేషన్ పుణ్యమా అని ఈ ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణ ఇప్పుడు పర్యాటకుల గుప్పెట్లోకి వచ్చేసింది, అలాగే పర్యాటకులకు, తాము ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లే వీలు ఇది కల్పించింది. రియల్ టైమ్ 360 ఫుటేజ్‌కు, అలాగే ఆ ప్రదేశానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే వర్చువల్ వీక్షణలకు యాక్సెస్ దొరకడం వల్ల సందర్శకులకు తమ ప్రయాణ అంచనాలను సెట్ చేసుకోవడానికి, అలాగే తదనుగుణంగా ప్రయాణించడానికి సహాయపడింది.

 

భూటాన్‌కు చెందిన Google Street View వెర్షన్, ఆ దేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే జనాలందరికీ కూడా మేలు చేసింది. ల్యాండ్ సర్వేయర్‌లు, బిజినెస్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, ఇంకా ఇతర సంస్థల వారు తమ సర్వీస్‌లను మెరుగుపరుచుకోవడానికి దీన్ని ఉపయోగించే అవకాశం ఉంది.

-

డోర్జీ ద్రాధుల్, భూటాన్ టూరిజం కౌన్సిల్‌కు డైరెక్టర్ జనరల్

 

Street Viewకు కొత్తగా 500 బిజినెస్‌లు జోడించబడ్డాయి. అలాగే భూటాన్ మ్యాప్‌లకు 4,000 అప్‌డేట్‌లు జరిగాయి. దీంతో రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లు, మార్గానికి సంబంధించిన సూచనల నుండి లోకల్ బిజినెస్‌లు ఇంకా ఎక్కువ మందికి చేరువవ్వడం వరకు అన్ని విషయాల్లోనూ ఆ దేశస్థులు ప్రయోజనాలు పొందుతున్నారు.

Google Street View మ్యాపర్లు భూటాన్‌లో కారులో కెమెరాను సెట్ చేస్తున్నారు

మెరుగైన వీధి వీక్షణలు

ప్రభుత్వం చేపట్టిన Street View కార్యక్రమం, ప్రపంచానికి చేరువ అవ్వడంలో ఆ దేశానికి సహాయపడటమే కాకుండా, అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేయడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడింది. ఎన్నో శతాబ్దాలుగా లోకానికి పరిచయం కాని భూభాగాన్ని చిత్రీకరించడం అనేది, భూటాన్ వారసత్వ పరిరక్షణ వ్యూహానికి నాంది అయిందని చెప్పవచ్చు. Street View డేటా ద్వారా, వారు రోడ్ల పరిస్థితిని అంచనా వేసి, అవసరమైన చోట్ల రిపేర్‌లు చేయవచ్చు.

ఇప్పుడు భూటాన్ వైపు మరింత మంది అన్వేషకులు ఆకర్షితులు అవుతున్నారు. కానీ ఇప్పటి దాకా ఇందులో ఇరవై పట్టణాలను మాత్రమే కవర్ చేయడం జరిగింది, ఇది 38,394 చదరపు కిలోమీటర్‌ల ప్రాంతం; కొత్తగా ఏర్పాటయ్యే మౌలిక సదుపాయాలతో క్రమం తప్పకుండా మ్యాప్‌లను అప్‌డేట్ చేయాలనే ప్లాన్‌లు కూడా ఉన్నాయి, వీటన్నింటినీ పరిగణించి చూస్తే, Street View కార్యక్రమం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని చెప్పవచ్చు.

చిన్న ప్రపంచాలను కనెక్ట్ చేయడం ద్వారా Street View పెను మార్పును తీసుకువస్తోంది. ఆకట్టుకొనే ఇమేజ్‌ల సహాయంతో జగమెరుగని అందాలను వెలికితీయడం అనేది, ఒక దేశ గతిని విప్లవాత్మకమైన రీతిలో మార్చగలదు, అలాగే అది దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలదు.

మరిన్ని అన్వేషించండి

మీ స్వంత Street View ఇమేజ్‌లను షేర్ చేయండి