మీ స్వంత Street View ఇమేజరీని క్రియేట్ చేసి, పబ్లిష్ చేయండి
కొత్త పరిసరాలు, పర్యాటక హాట్‌స్పాట్‌లు, లోకల్ బిజినెస్‌లను క్యాప్చర్ చేయడం అంత సులభం కాదు. మీ కెమెరాను ఎంచుకుని, మీ 360 వీడియోలను కలెక్ట్ చేసి, Street View Studioకు అప్‌లోడ్ చేయండి, అంతే!
మీ పరిసరాలు, మీ సాంస్కృతిక వారసత్వం, ఇంకా లోకల్ బిజినెస్‌లను ప్రపంచంలో ఉన్న ప్రేక్షకులకు చూపండి.
నగరాలకు రోడ్ ట్రాఫిక్‌ను పర్యవేక్షించడంలో సహాయపడండి, మౌలిక సదుపాయాల నష్టాన్ని అంచనా వేయండి, నిర్వహణ పనిని ఆప్టిమైజ్ చేయండి, ఇంకా రికవరీ ప్రయత్నాలలో సహాయం చేయండి.
నడక మార్గాలు, యాక్సెసిబిలిటీ పాయింట్‌లను మ్యాపింగ్ చేయడం ద్వారా పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచండి.
మీ 360 ఇమేజరీని ప్రపంచవ్యాప్తంగా పబ్లిష్ చేయడానికి కేవలం 3 దశలు మాత్రమే ఉన్నాయి
Street View-అనుకూల కెమెరాతో వీధులు, దారులు, పర్యాటక ప్రాంతాలు, ఇంకా బిజినెస్‌లను క్యాప్చర్ చేయండి. Google Mapsలో మీ వీధి కనబడకపోతే
మా Google Maps కంటెంట్ పార్ట్‌నర్ల పేజీలో, డేటాను మేనేజ్ చేయడానికి లేదా కంట్రిబ్యూట్ చేయడానికి ఇతర మార్గాలను చూడండి.
*Note that Google does not certify any operational or mechanical functions. Any specific technical or logistical issues should be addressed directly with the supplier.
డ్రైవ్ చేస్తూ, రైడ్ చేస్తూ లేదా నడుచుకుంటూ వెళ్లినప్పుడు తోడుగా మీ కెమెరాను తీసుకువెళ్లండి
మీ చేతులను స్టీరింగ్ మీదే ఉంచి ప్రయాణంలో మీ 360 ఇమేజరీని క్రియేట్ చేయండి. మీ వీధిని మ్యాప్ చేసేటప్పుడు వెహికల్ మౌంట్‌ను లేదా హెల్మెట్ మౌంట్‌ను ఉపయోగించండి లేదా మీరు ఇండోర్ ఇమేజరీని క్రియేట్ చేస్తుంటే మీ కెమెరాను మినీ ట్రైపాడ్ లేదా మోనోపాడ్‌తో మౌంట్ చేయండి.
ఒకే సమయంలో అనేక ఫైల్స్‌ను అప్‌లోడ్ చేయండి, అప్‌లోడ్ పూర్తయ్యే ముందు మీ ఇమేజ్‌లను ప్రివ్యూ చేయండి. మీ 360 ఇమేజరీ గణాంకాలను యాక్సెస్ చేయండి, మీ భవిష్యత్తు క్యాప్చర్ మార్గాలను సులభంగా ప్లాన్ చేయండి.
ప్రపంచవ్యాప్తంగా తమ గమ్యస్థాన విజిబిలిటీని మెరుగుపరచడానికి ప్రభుత్వ సంస్థలు, పర్యాటక సంస్థలు Street Viewని ఎలా ఉపయోగిస్తున్నాయో తెలుసుకోండి.
Street Viewతో స్థానిక కమ్యూనిటీలకు సాధికారతను కల్పించడం
2019లో, ఒక ఫోటోగ్రాఫర్ల గ్రూప్ జాంజిబార్ను మ్యాప్ చేయడం ప్రారంభించింది. పర్యాటక రంగంపై, అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రాజెక్ట్ ప్రభావం గురించి మరింత తెలుసుకోండి.
ఫ్రెంచ్ పాలినేషియా దీవులను క్యాప్చర్ చేస్తున్న ఆల్ టెర్రయిన్ వెహికల్స్
ఒక స్థానిక ఫోటోగ్రాఫర్, ఫ్రెంచ్ పాలినేషియా ఇమేజ్‌లను మ్యాప్‌లోకి తీసుకురావడానికి, స్థానిక ఎమర్జెన్సీ సహాయక సిబ్బందికి వారి సర్వీస్‌లను మెరుగుపరచడంలో సహాయపడటానికి గోల్ఫ్ కార్ట్‌లను, జెట్ స్కీలను, అలాగే గుర్రాలను ఉపయోగించి క్రియేటివిటీని చూపారు.
దేశాన్ని మ్యాప్ చేయడానికి, Street View గురించి స్థానికులకు అవగాహన కల్పించడానికి, ఇంకా ప్రాజెక్ట్‌ను కొనసాగించేలా వారిని చైతన్యపరచడానికి, ప్రభుత్వం WT360తో చేతులు కలిపింది.
మయన్మార్‌ను డిజిటైజ్ చేసి, దాని సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం
మయన్మార్‌కు సంబంధించిన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి, ఒక వర్చువల్ రియాలిటీ ప్రొడక్షన్ కంపెనీ Street View సహాయంతో, ఆ దేశాన్ని ఎలా డిజిటైజ్ చేయడం ప్రారంభించిందో తెలుసుకోండి.
కారు, సైకిల్, ఇంకా పడవ ద్వారా జింబాబ్వేను మ్యాప్ చేయడం
టవాండా కన్హేమా, వారి దేశాన్ని మ్యాప్ చేస్తున్నారు. ఆయన విక్టోరియా ఫాల్స్ ఇమేజ్‌లను ఎలా క్యాప్చర్ చేశారు, ఇంకా మరిన్ని లొకేషన్లకు Street Viewలో ఎలా స్థానం కల్పిస్తున్నారు అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
లోకల్ గైడ్లు, కెన్యా అందాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు
కెన్యాను మ్యాప్ చేసి, దాని అందాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి, లోకల్ గైడ్లు, ఇంకా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు చేతులు కలిపారు. వారి మ్యాపింగ్ ప్రయాణం గురించి మరింత తెలుసుకోండి.
బెర్ముడాకు సంబంధించిన ఆన్లైన్ సమాచారాన్ని ఆప్టిమైజ్ చేయడానికి, స్థానికంగా ఉండే బిజినెస్‌లను కనుగొనే వీలును పెంచడానికి, ఇంకా పర్యాటకులకు తమ ట్రావెల్‌ను ప్లాన్ చేసుకోవడంలో సహాయపడటానికి, బెర్ముడా టూరిజం అథారిటీ, Miles Partnership చేతులు కలిపాయి.
టోంగా, అలాగే ఇతర పసిఫిక్ దీవుల సంస్కృతిని హైలైట్ చేయడానికి, ఆ మొత్తం ద్వీపసమూహాన్ని మ్యాప్ చేసి, దాన్ని Street Viewకు జోడించాలనే మహత్తరమైన ప్రణాళికకు Grid Pacific వ్యవస్థాపకులు శ్రీకారం చుట్టారు.