మేము 360 ఇమేజ్‌లను ఎప్పుడు, ఎక్కడ, ఎలా సేకరిస్తామో తెలుసుకోండి
Googleకు చెందిన రంగురంగుల Street View ఎక్విప్‌మెంట్ గురించి తెలుసుకోండి, ప్రపంచ మ్యాప్‌నకు జీవం పోయడానికి మేము 360 ఇమేజ్‌లను ఎలా సేకరిస్తామో తెలుసుకోండి.
ఫోటోల మూలాధారాలు
Street View ఫోటోలు, రెండు సోర్స్‌ల నుండి వస్తాయి, ఒకటి Google, మరొకటి మా కంట్రిబ్యూటర్‌లు.
Google-స్వంత కంటెంట్ క్రెడిట్‌లు “వీధి వీక్షణ” లేదా “Google మ్యాప్స్.” మా చిత్రాలలో కనిపించే ముఖాలు మరియు లైసెన్స్ ప్లేట్‌లను మేము ఆటోమేటిక్‌గా అస్పష్టంగా చేస్తాము.
వినియోగదారు అందించిన కంటెంట్‌లో క్లిక్ చేయగల/నొక్కగల ఖాతా పేరు ఉంటుంది, కొన్ని సందర్భాలలో ప్రొఫైల్ ఫోటో కూడా ఉంటుంది.
ఈ నెల మేము ఎక్కడ మ్యాప్ చేస్తున్నాము
మీ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడంతో పాటు, మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడంలో మీకు సహాయపడే ఇమేజ్‌లను మీకు అందించడానికి, మేము ప్రపంచవ్యాప్తంగా డ్రైవ్ చేస్తూ, సుదూరప్రయాణం చేస్తుంటాము. మా టీమ్‌కు మీరు స్వాగతం పలకాలనుకుంటే, మీకు దగ్గర్లోని లొకేషన్‌కు వారు ఎప్పుడు వస్తున్నారో తెలుసుకోవడానికి, కింద చూడండి.
తేదీ | జిల్లా |
---|
తేదీ | జిల్లా |
---|
మా నియంత్రణలో లేని (వాతావరణం, రహదారి మూసివేతలు, మొ.) కారణాల వల్ల, మా కార్లు ఆగిపోవడం లేదా స్వల్ప మార్పులు జరగవచ్చు. జాబితాలో నిర్దిష్ట నగరాన్ని పేర్కొన్నప్పుడు, డ్రైవింగ్ దూరపు పరిథిలో ఉన్న చిన్న నగరాలు మరియు పట్టణాలు కూడా చేర్చబడతాయని దయచేసి గుర్తుంచుకోండి.
ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్న ఎక్విప్‌మెంట్
మేము ప్రపంచంలో ఉండే ఏడు ఖండాలలో ఉన్న అద్భుతమైన ప్రదేశాలకు వెళ్లాము, ఇంకా మరిన్ని ప్రదేశాలను మీకు అందించనున్నాము. మేము రోడ్డుపై అడుగు పెట్టే ముందు, సరైన ఎక్విప్‌మెంట్‌ను ఉపయోగించి అత్యుత్తమమైన ఇమేజ్‌లను క్యాప్చర్ చేయడానికి, భూభాగం, వాతావరణ పరిస్థితులు, ఇంకా జన సాంద్రతతో సహా అనేక అంశాలను పరిశీలిస్తాము.
Street View కారు
ట్రెక్కర్
మ్యాప్‌లకు జీవం పోయడం
మేము ఇమేజ్‌లను సేకరించడం పూర్తి అయ్యాక, వాటన్నింటినీ మీకు అందుబాటులోకి తీసుకురావాల్సిన పని చేయాల్సి ఉంటుంది. మా టీమ్ తెరవెనుక ఏం చేస్తుందో సంక్షిప్త రూపంలో ఇక్కడ అందించాము.
-
చిత్రాలను సేకరించడం
వీధి వీక్షణలో చూపడానికి ముందుగా మేము నిజంగా స్థానాల చుట్టూ డ్రైవ్ చేసి, ఫోటోలు తీయాలి. మేము వీలైనంత ఉత్తమమైన చిత్రాలను ఎప్పుడు మరియు ఎక్కడ సేకరించాలో గుర్తించేందుకు, విభిన్న ప్రాంతాల వాతావరణం మరియు జనాభా సాంద్రతతో సహా చాలా అంశాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తాము.
-
చిత్రాలను సమలేఖనం చేయడం
మ్యాప్‌లో ఒక్కో చిత్రాన్ని దాని భౌగోళిక స్థానానికి జత చేయడానికి, మేము కారు పైన ఉండే GPS, వేగం మరియు దిశను కొలిచే సెన్సార్‌ల నుండి సంకేతాలను కలుపుతాము. ఇది కారు యొక్క ఖచ్చితమైన మార్గాన్ని పునర్నిర్మించడానికి మరియు అవసరమైనట్లు చిత్రాలను తిప్పడానికి మరియు తిరిగి సమలేఖనం చేయడానికి మాకు సహాయపడుతుంది.
-
ఫోటోలను 360 ఫోటోలుగా మార్చడం
360 ఫోటోలలో అంతరాలను నివారించడం కోసం, సమీపంలో ఉన్న కెమెరాలు స్వల్పంగా అతివ్యాప్తి చెందేలా ఫోటోలు తీస్తాయి, ఆపై ఆ ఫోటోలన్నింటినీ మేము ‘జోడించి’ ఒక 360 డిగ్రీ చిత్రాన్ని రూపొందిస్తాము. ఆపై ‘అంతరాలు’ తగ్గించి, మృదువైన పరివర్తనలను సృష్టించడం కోసం మేము ఒక ప్రత్యేకమైన చిత్ర ప్రాసెసింగ్ అల్గారిథమ్‌లను వర్తింపజేస్తాము.
-
మీకు సరైన చిత్రం చూపబడుతుంది
తలాల నుండి కారు యొక్క లేజర్ కిరణాలు పరావర్తనం చెందే వేగం భవనం లేదా వస్తువు ఉన్న దూరాన్ని మాకు తెలుపుతుంది, ప్రపంచపు 3D నమూనాను నిర్మించడానికి మాకు వీలు కల్పిస్తుంది. Street Viewలో దూరంగా ఉన్న ప్రాంతానికి మీరు వెళ్లినప్పుడు, ఆ లొకేషన్ కోసం మీకు చూపగల ఉత్తమమైన పనోరమాను ఈ నమూనా నిర్ధారిస్తుంది.