దుర్వినియోగ పద్ధతులు, స్కామ్‌ల పట్ల అలర్ట్‌గా ఉండండి
Google ఉద్యోగులుగా చెప్పుకునే వ్యక్తులు, పలు రకాలుగా సపోర్ట్ అందిస్తామని, అలాగే ఇమేజ్‌ను గానీ, ఏ రకమైన డేటాను అయినా గానీ అప్‌డేట్ చేస్తామంటూ మీ దగ్గరకు వచ్చినప్పుడు, లేదా వారి కాంటాక్ట్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ కంపెనీలకు Google తరఫున మాట్లాడే అధికారం లేదు. ఇవి తమను తాము ఇండిపెండెంట్ కాంట్రాక్టర్లుగా చెప్పుకోవాలని మేము గట్టిగా చెబుతున్నాము.
నేరుగా Google నుంచి మిమ్మల్ని సంప్రదిస్తున్నామని ఎవరైనా చెబితే, దయచేసి అటువంటి కాంటాక్ట్‌ను ఇగ్నోర్ చేయాలని (విస్మరించాలని) మేము గట్టిగా సూచిస్తున్నాము. కింది పేర్కొన్న సందర్భాలతో సహా దానికి కారణం ఏదైనా కావచ్చు:
- Google తరఫున సర్వీస్‌లను/ట్రెయినింగ్‌ను ఆఫర్ చేయడం: డేటా పాయింట్లను ఎవాల్యుయేట్ (కొలమానాలను మెజర్) చేస్తామని, డిజిటల్ మీడియాను అనలైజ్ చేస్తామని, డిజిటల్ ట్రెండ్స్ పైన లేదా కొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల పైన, న్యూ బిజినెస్ ట్రెండ్స్ పైన రిపోర్ట్ అందిస్తామని, మీడియా సలహా ఇస్తామని, ఇలా తదితర పనులు చేస్తామని చెప్పడం;
- Google సర్వీస్‌లు, సాధారణంగా పని చేసే విధానానికి విరుద్ధంగా ఉండే ప్రామిస్‌లు చేయడం: ఉదాహరణకు Search, Google Street View, Google Maps వంటి వాటిలో దేనిలోనైనా ప్లేస్‌మెంట్ ప్రామినెంట్‌గా కనపడేలా చేస్తామని హామీ ఇవ్వడం.
- Google ప్లాట్‌ఫామ్‌ల నుండి కంటెంట్‌ను తీసివేయాలంటూ అదే పనిగా టెలీమార్కెటింగ్ ఫోన్ కాల్స్ చేస్తూ, లేదా బెదిరిస్తూ కాంట్రాక్ట్ (ఒప్పందం) చేసుకున్న పార్టీ పైన ఒత్తిడి తేవడం.
ఈ విషయాన్ని గమనించండి: Google, ఫోటోగ్రాఫర్‌లను లేదా ఏజెన్సీలను నియమించుకోదు. ఈ ప్రొఫెషనల్స్ (నిపుణులు), ఇండిపెండెంట్ ఎంటిటీలకు చెందిన వారు. అన్ని నెగోషియేషన్స్ (చర్చలు) Google ప్రమేయం గానీ, భాగస్వామ్యం గానీ లేకుండా జరుగుతాయి.
యూజర్ సేఫ్టీ (భద్రత) మాకు టాప్ ప్రయారిటీ అంశం. ఆ కారణంగా, మేము Google బ్రాండ్‌ల వినియోగం పైన, దాని ప్లాట్‌ఫామ్‌ల వినియోగం పైన పరిమితులు విధిస్తాము. ఈ కింద పేర్కొన్న వాటిని చేయడానికి ఏ ఎంటిటీకీ అధికారం లేదు:
- కంపెనీ వాహనాలపై Google బ్రాండ్‌ను, అంటే Street View చిహ్నం, సీల్ మరియు/లేదా లోగో వంటి వాటిని ఉపయోగించడం;
- Google బ్రాండ్‌లు, Google Maps, Street View, లేదా ఇతర Google ట్రేడ్ మార్క్‌లు లేదా అటువంటి వాటిని డొమైన్ పేరులో ఉపయోగించడం;
- Google బ్రాండ్‌లు, Google Maps, Street View, లేదా ఇతర Google ట్రేడ్ మార్క్‌లు లేదా అటువంటి వాటిని దుస్తులకు సంబంధించిన ఐటెమ్‌లపై (యూనిఫామ్‌లు మొదలైన వాటిపై) ఉపయోగించడం;
- వారి Google Business Profileలో Google, Google Maps, Street View బ్రాండ్‌లు లేదా ఏదైనా ఇతర Google ట్రేడ్ మార్క్ లేదా అటువంటి వాటిని ఉపయోగించడం;
- నిర్దిష్ట ప్రోడక్ట్‌ను లేదా సర్వీస్‌ను Google ఎండార్స్ చేస్తుంది అనిపించేలా, ఏవైనా Google ట్రేడ్ మార్క్‌లను ఉపయోగించడం.