Street View విశ్వసనీయ ఫోటోగ్రాఫర్ల సంబంధిత పాలసీ
తమ కస్టమర్ల తరఫున Google ప్రోడక్ట్లలో ఉపయోగించాల్సిన ఇమేజ్‌లను సేకరిస్తున్న Street View విశ్వసనీయ పార్ట్నర్లందరికీ ఈ పాలసీ వర్తిస్తుంది.
మా వీధి వీక్షణ విశ్వసనీయ ఫోటోగ్రాఫర్ల పాలసీ ఈ కింది నాలుగు అంశాలకు వర్తిస్తుంది:
- పారదర్శకతా ఆవశ్యకాలు: మీ కస్టమర్లతో షేర్ చేయడానికి మీకు కావాల్సిన సమాచారం
- అనుసరించకూడని పద్ధతులు: మీ కస్టమర్ల తరఫున మీరు Google ప్రోడక్ట్లలో అప్లోడ్ చేసిన ఇమేజ్‌లను ప్రచురించాలంటే లేదా నిర్వహించాలంటే మీరు చేయకూడని విషయాలు
- బ్రాండింగ్ మార్గదర్శకాలు: Google బ్రాండింగ్ ఎలిమెంట్స్ సముచిత వినియోగం అంటే ఏమిటి
- క్వాలిటీ ఆవశ్యకాలు: మీ కస్టమర్ల Google అడ్వర్టయిజింగ్ ఖాతాలను మీరు ఎలా ఏర్పాటు చేయాలి
పారదర్శకతా ఆవశ్యకాలు
Google ప్రోడక్ట్లలో ఇమేజ్‌లను అప్లోడ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను కస్టమర్లకు పూర్తిగా తెలియాలంటే, వారు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వారికి సరైన సమాచారం అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి, మా విశ్వసనీయ పార్టనర్లందరూ, ఈ నిర్ణయాలను ప్రభావితం చేసే సమాచారం విషయంలో పారదర్శకంగా ఉండాలని మేము కోరుతున్నాము. కింద పేర్కొన్న ముఖ్యమైన అంశాలతో పాటు, కస్టమర్లు కోరినప్పుడు సంబంధిత ఇతర సమాచారాన్ని అందివ్వడానికి విశ్వసనీయ పార్ట్నర్లు తప్పనిసరిగా తగిన ప్రయత్నం చేయాలి.
మీ ఫోటోగ్రఫీ సర్వీస్‌లను ఇతరులకు విక్రయిస్తున్న సమయంలో మీరు తప్పనిసరిగా అదే పారదర్శకతను కలిగి ఉండటం, మీ బాధ్యతలు, హక్కులను అర్థం చేసుకోవడం ముఖ్యం, ఎందుకంటే అందులో ఇతర వ్యక్తులు, బ్రాండ్లు, స్థానిక చట్టాలు ఉండవచ్చు.
సర్వీస్‌ల ఫీజులు, ఖర్చులు
విశ్వసనీయ ప్రోగ్రామ్‌లో పాల్గొనే వ్యక్తులు, వారు అందించే విలువైన సర్వీస్‌లకు తరచుగా మేనేజ్మెంట్ ఫీజును ఛార్జీ చేస్తుంటారు, ఇలా ఫీజులు విధించే పక్షంలో ఇమేజరీని కొంటున్న వారికి ఈ సంగతి తెలియాలి. కనీసం, కొత్త కస్టమర్లకు తొలిసారి అమ్ముతున్నప్పుడు ఛార్జీలు విధిస్తారనే విషయాన్ని వారికి రాతపూర్వకంగా తెలియజేయండి. కస్టమర్లకు ఇచ్చే ఇన్వాయిస్లలో మీ ఫీజులు, ఖర్చుల గురించి వివరించండి.
ముఖ్యంగా చిన్న బడ్జెట్‌తో ఇమేజరినీ కొనుగోలు చేసే వారికి, Street View విశ్వసనీయ ఫోటోగ్రాఫర్‌తో పని చేసేటప్పుడు ఏమి ఆశించాలి అనే దాని గురించి స్పష్టంగా తెలియాలి, పెద్ద బడ్జెట్‌తో ఇమేజరీని కొనుగోలు చేసే వారి వద్ద ఉండే రిసోర్స్‌లు, లేదా నైపుణ్యం వీరి వద్ద ఉండకపోవచ్చు కాబట్టి ఈ వివరాలు వీరికి తప్పనిసరిగా అందించాలి.
నిజాయితీతో కూడిన ప్రకటన
Street View ట్రస్టెడ్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్న వ్యక్తిగా, మిమ్మల్ని Google నియమించిందని సూచించే విధంగా మీరు అస్సలు ప్రవర్తించకూడదు. ఒక సంపూర్ణ స్వతంత్ర బిజినెస్ ఎంటిటీకి మీరు ప్రతినిధి అనిపించేలా నిజాయితీగా వ్యవహరించండి, పబ్లిషింగ్ సర్వీస్ అందించడంలో Googleకు పరిమితమైన పాత్ర ఉంటుందని క్లయింట్లకు వివరించండి.
వ్యక్తిగత బాధ్యత
పబ్లిష్ చేసిన ఇమేజ్‌లు, సాధారణంగా కొన్ని సెకన్లలోనే Google Mapsలో కనిపిస్తాయి, అయితే ఈ ఇమేజ్‌లు Maps యూజర్ కంట్రిబ్యూటెడ్ కంటెంట్ పాలసీకి లేదా Google Maps సర్వీస్ నియమాలకు అనుగుణంగా లేకపోతే వాటిని తర్వాత తిరస్కరించే అవకాశం ఉంది.
- కమీషన్ ఆధారిత ఇమేజ్‌లలో వేటినైనా Google Maps తీసివేస్తే, ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను ఫోటోగ్రాఫర్, బిజినెస్ ఓనర్ తీసుకోవాల్సి ఉంటుంది.
- మా పాలసీలకు విరుద్ధంగా ఉన్న ఇమేజ్‌లను వెంటనే సరిచేయాలని లేదా రీప్లేస్ చేయాలని — అలాగే అవి Google Maps కోసం ఆమోదించబడేలా చూడాలని — లేదా సమస్యను పరిష్కరించలేని సందర్భంలో క్లయింట్‌కు పూర్తి రీఫండ్ ఇవ్వమని మేము ఫోటోగ్రాఫర్లకు సిఫార్సు చేస్తున్నాము.
ఇమేజ్ యాజమాన్య హక్కు
ఫోటోగ్రాఫర్లు, బిజినెస్ ఓనర్లు కలిసి పని చేస్తున్నప్పుడు, ఇరు పక్షాలు ఒక రాతపూర్వక ఒప్పందం కుదుర్చుకోవాలని, అందులో ఒప్పంద నియమాలు, వారంటీ, భవిష్యత్తు యాజమాన్య హక్కులను నిర్దేశించే అంశాలు ఉండేలా చూసుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.
- ఫోటోలు తీయడం పూర్తయిన తర్వాత ఆ ఇమేజ్‌లు ఎవరి సొంతం అవుతాయో తప్పకుండా నిర్ధారించుకోండి. ఒకవేళ ఫోటోగ్రాఫర్ యాజమాన్య హక్కును తమ వద్దే అట్టిపెట్టుకుంటే, ఫోటోగ్రాఫర్ యొక్క కాపీరైట్‌ను అతిక్రమించకుండా ఇమేజ్‌లను ఎలా ఉపయోగించాలో బిజినెస్ ఓనర్‌కు తప్పకుండా తెలియజేయాలి. రెండు ఖాతాలలో (ఫోటోగ్రాఫర్, బిజినెస్ ఓనర్ ఖాతాల వంటివి) ఒకే ఇమేజ్ను రెండు సార్లు పబ్లిష్ చేయకూడదు.
చట్టాన్ని పాటించడం
క్లయింట్లకు సర్వీస్ అందిస్తున్నప్పుడు తప్పకుండా వర్తించే చట్టాలన్నింటినీ పాటించేలా చూసుకోండి. మీ నైపుణ్యాన్ని లేదా మీరు చేసే పని ఫలితం ఎంత నాణ్యంగా ఉంటుంది అనే దానిని తప్పుగా చెప్పకండి. ఏ పని కోసమైతే మిమ్మల్ని నియమించడం జరిగిందో, ఆ పని పూర్తి చేయడానికి అవసరమైన స్థాయిలో బీమాను తప్పకుండా తీసుకొనేలా కూడా చూసుకోండి.
ఇమేజ్ విజిబిలిటీ
బిజినెస్ ఓనర్లు, ఫోటోగ్రాఫర్ల మధ్య ఉన్న ఒప్పందాలతో సహా, థర్డ్-పార్టీల మధ్య కుదిరిన న్యాయపరమైన లేదా వాణిజ్యపరమైన ఒప్పందంతో సంబంధం లేకుండా Google Mapsలోని ఇమేజ్‌లకు Google ర్యాంకింగ్ ఇస్తుంది. ఫోటోలు తీయడం కోసం ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌కు బిజినెస్ ఓనర్ పేమెంట్ చేశారనే విషయం, Google Mapsలో ఇమేజ్‌లకు ఎలాంటి ర్యాంక్ ఇవ్వాలి లేదా అవి ఎలా కనిపించాలి అనే దానిని ప్రభావితం చేయదు.
ప్రయోజన వైరుధ్యం లేదు
కొన్ని Google ప్రోగ్రామ్‌లలో, ప్రత్యేకించి లోకల్ గైడ్ల లాంటి వాటిలో మీరు నాన్-ప్రొఫెషనల్ స్థాయిలో పాల్గొనాలి (ఉదాహరణకు, మీరు కంట్రిబ్యూట్ చేసే కంటెంట్‌కు మీకు ప్రతిఫలం ఏదీ ఉండదు). మీరు అద్దె ప్రాతిపదికన సర్వీస్‌లను అందించేటట్లయితే (ఉదాహరణకు మిమ్మల్ని మీరు Street View విశ్వసనీయ ప్రొవైడర్‌లా మార్కెటింగ్ చేసుకోవడం), ఈ ప్రొఫెషనల్ సర్వీస్‌లను మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన నాన్-ప్రొఫెషనల్ సర్వీస్‌లతో (ఉదాహరణకు లోకల్ గైడ్‌గా రేటింగ్ లేదా రివ్యూను పోస్ట్ చేయడం లాంటివి) కలపకూడదు.
Google బ్రాండ్ల యొక్క సముచిత వినియోగం
విశ్వసనీయ స్టేటస్ సంపాదించిన ఫోటోగ్రాఫర్లు లేదా కంపెనీలు మాత్రమే Google Maps Street View బ్రాండ్, విశ్వసనీయ బ్యాడ్జ్‌ను మార్కెటింగ్ అస్సెట్లుగా ఉపయోగించగలవు. ఒక విశ్వసనీయ ఫోటోగ్రాఫర్‌గా మీ విశేష ప్రతిభాపాటవాలు కనబర్చాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. Google Maps, Street View లేదా ఏవైనా ఇతర సంబంధిత లోగోలతో సహా విశ్వసనీయ బ్యాడ్జ్, పదం గుర్తు, బ్రాండింగ్ ఎలిమెంట్స్‌ను విశ్వసనీయ నిపుణులు ఉపయోగించవచ్చు. వాటితో మీరు చేయగలిగిన, చేయకూడని కొన్ని విషయాలు కింద తెలియజేయబడ్డాయి. మా బ్రాండ్ అస్సెట్‌లకు సంబంధించి Google అనుమతించిన వినియోగ విధానాలను ఎవరైనా ఉల్లంఘిస్తున్నట్లు మీరు భావిస్తే, ఇక్కడ వాటిని రిపోర్ట్ చేయవచ్చు. ఇతర Google బ్రాండ్ అస్సెట్ల అనుచిత వినియోగాలను మీరు ఇక్కడ రిపోర్ట్ చేయవచ్చు.
విశ్వసనీయ బ్యాడ్జ్ వినియోగం
- మీరు Street View ట్రస్టెడ్ ప్రోగ్రామ్‌లో సర్టిఫైడ్ మెంబర్ అయితేనే విశ్వసనీయత బ్యాడ్జ్‌ను, ఇంకా బ్రాండింగ్ ఎలిమెంట్స్‌ను ఉపయోగించండి.
- విశ్వసనీయ బ్యాడ్జ్‌ను మీరు ఎక్కడ ప్రదర్శించడానికైనా, తప్పనిసరిగా తెల్లని బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి, చుట్టూ తగినంత ఖాళీ ఉండాలి.
- మీ పేరు లేదా కంపెనీ పేరు, లోగోతో మాత్రమే విశ్వసనీయ బ్యాడ్జ్‌ను ఉపయోగించండి.
- మీరు, విశ్వసనీయ బ్యాడ్జ్, బ్రాండింగ్ ఎలిమెంట్స్‌ను వెబ్సైట్లు, ప్రెజెంటేషన్లు, బిజినెస్ దుస్తులు, ప్రింట్ చేసి విక్రయించే మెటీరియల్‌లలో ఉపయోగించవచ్చు.
- పేజీ/దుస్తులలో బ్యాడ్జ్, బ్రాండింగ్ ఎలిమెంట్స్ అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఎలిమెంట్స్ కావని నిర్ధారించుకోండి.
- Google Maps, Street View లేదా విశ్వసనీయ బ్యాడ్జ్, లోగోలు లేదా పదం గుర్తులు వేటినీ మార్చకండి. అలాగే ఏవైనా గ్రాఫిక్స్ జోడించడం, ఇమేజ్‌లను సాగదీయడం లేదా అనువదించడం లాంటివి కూడా చేయకండి.
- తప్పుదారి పట్టించేలా లేదా దుర్వినియోగమయ్యేలా బ్యాడ్జ్‌ను ఉపయోగించకండి. ఉదాహరణకు, ఏదైనా ప్రోడక్ట్‌ను లేదా సర్వీస్‌ను Google ఎండార్స్ చేస్తున్నట్టుగా బ్యాడ్జ్‌ను ఉపయోగించడం.
మీ సర్వీసులను విక్రయిస్తున్నప్పుడు
- మీ బిజినెస్ సర్వీస్‌లలో భాగంగా ప్రొఫెషనల్‌గా ఉన్న 360 డిగ్రీ ఫోటోలను ఆఫర్ చేయండి.
- మీరు బిజినెస్ సంస్థలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మీరు విశ్వసనీయ ప్రోగ్రామ్‌లో భాగంగా పని చేస్తున్నారనే విషయాన్ని దాచిపెట్టకండి లేదా తప్పుగా చెప్పకండి.
- మీరు అద్దె ప్రాతిపదికన అందించే ఏ సర్వీస్‌లనూ మీ లోకల్ గైడ్ మెంబర్‌షిప్‌తో (ఉదాహరణకు Street View విశ్వసనీయ ప్రొవైడర్‌లా మీకు మీరుగా మార్కెటింగ్ చేసుకోవడం లాంటివి) కలపకండి.
మీ వెబ్సైట్ గురించి బ్రాండింగ్ చేయడం
- Google, Google Maps, Street View, విశ్వసనీయత బ్యాడ్జ్, లేదా ఏదైనా ఇతర Google ట్రేడ్ మార్క్‌ను లేదా వాటిలాగే ఉన్న వాటిని డొమైన్ పేరులో ఉపయోగించవద్దు.
- మీరు విశ్వసనీయత బ్యాడ్జ్‌ను మీ వెబ్సైట్లో ప్రదర్శించవచ్చు.
మీ వాహన బ్రాండింగ్
- వాహనంపై గ్రాఫిక్స్‌ను ప్రదర్శించేటప్పుడు, మీ సొంత బ్రాండ్‌ను, ఇంకా లోగోను మాత్రమే మీరు ఉపయోగించాలి.
- వాహనంపై Street View చిహ్నం, బ్యాడ్జ్, లోగోలతో సహా Google బ్రాండింగ్ ఎలిమెంట్స్ వేటినీ ప్రదర్శించకండి.
360 డిగ్రీల ఇమేజ్‌ల పైశీర్షం/కింది భాగంలో బ్రాండింగ్
- మీ కంపెనీ లోగో/పేరును సంబంధిత సైజ్‌లో అట్టడుగు భాగం/పై భాగంలో ఉపయోగించండి. ఏవైనా ఫార్మాట్ నిర్దిష్ట ప్రమాణాల కోసం పాలసీ మార్గదర్శకాలు చూడండి.
- మీ చిత్రం అడుగు భాగంలో లేదా మీ వాహన పైకప్పుపై బ్రాండింగ్‌ను జోడిస్తున్నప్పుడు, మీరు తప్పనిసరిగా వీటిని పాటించాలి:
- బ్రాండింగ్‌ను ఉపయోగించడానికి అనుమతి ఉండాలి.
- సంబంధితమైన (ఉదాహరణకు, స్థానిక పర్యాటక ప్రచారం) లేదా ప్రస్తావనకు మాత్రమే పరిమితం చేయబడిన కంటెంట్‌నే ప్రదర్శించాలి.
- స్పాన్సర్షిప్/ప్రస్తావన విషయంలో, ప్రదర్శించబడిన బ్రాండింగ్ తప్పనిసరిగా:
- Google బ్రాండ్ అస్సెట్తో కలిసి ఉండకూడదు.
- ఏదైనా ప్రచార గ్రాఫిక్స్ లేదా భాషతో కలిసి ఉండకూడదు (ఇది చూపించిన లొకేషన్‌కు సంబంధించినది అయితే తప్పించి).
- "స్పాన్సర్ చేసిన వారు" లేదా దానికి సమానమైన అనువాదాన్ని చేర్చండి.
- విశ్వసనీయ బ్యాడ్జ్ లేదా ఏదైనా ఇతర Google బ్రాండింగ్‌ను (మీ కెమెరాకు కనిపించే ఏదైనా పైకప్పు గ్రాఫిక్స్‌తో సహా) మీ 360 డిగ్రీల చిత్రాల కింది బిందువు/పైశీర్షం దేనిలోనూ ఉపయోగించకండి.
మీరు ఈ గైడ్‌లైన్స్‌తో పాటుగా సక్రమ వినియోగానికి సంబంధించిన Google నియమాలు, బ్రాండ్ నియమాలు, షరతులు, భౌగోళిక వినియోగ గైడ్‌లైన్స్, అలాగే Google ట్రేడ్ మార్క్‌లకు వర్తించే ఇతర వినియోగ గైడ్‌లైన్స్ అన్నింటినీ తప్పకుండా ఫాలో అయ్యేలా చూసుకోండి.
Google Adsలో మీ బిజినెస్ సంస్థ గురించి యాడ్లు అందించడం
మీరు కావాలంటే మీ యాడ్లలో 'విశ్వసనీయ ఫోటోగ్రాఫర్ ప్రోగ్రామ్' అనే పదబంధాన్ని ఉపయోగించి మీ బిజినెస్ సంస్థ గురించి Google Adsలో అడ్వర్టయిజ్ చేసుకోవచ్చు. మీ యాడ్లలో మీరు నేరుగా "Street View" బ్రాండ్‌ను గానీ లేదా ఇంకేదైనా Google బ్రాండ్‌ను గానీ ఉపయోగించడానికి మీకు అనుమతి లేదని దయచేసి గమనించండి.
మీ Google Business Profile బ్రాండింగ్
మీకు Google Business Profile ఉంటే, మీరు Google Business Profile పాలసీలను, మరీ ముఖ్యంగా Googleలో మీ బిజినెస్‌కు ప్రాతినిధ్యం వహించే గైడ్‌లైన్స్‌ను గౌరవించాల్సి ఉంటుంది.
Google, Google Maps, వీధి వీక్షణ, లేదా ఇతర Google ట్రేడ్ మార్క్ లేదా వాటిలాగే ఉన్న వాటిని మీ Google Business Profile పేరులో ఉపయోగించవద్దు.
మీకు విశ్వసనీయ స్టేటస్ జారీ అయిన తర్వాత, మీ ప్రొఫైల్‌లో మీ విశ్వసనీయ బ్యాడ్జ్‌ను అప్లోడ్ చేయవచ్చు.
గమనిక: మీరు ఈ మార్గదర్శకాలను ఫాలో అవ్వకపోతే, మీరు ప్రోగ్రామ్‌లో స్టేటస్, విశ్వసనీయ బ్యాడ్జ్, ఇతర బ్రాండింగ్ ఎలిమెంట్స్‌ను ఉపయోగించగల హక్కు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
విశ్వసనీయ ఇమేజ్ క్వాలిటీ ఆవశ్యకాలు
ఇమేజ్ క్వాలిటీ
- 7.5 MP లేదా అంత కంటే పెద్దది (3,840 x 1,920 px)
- 2:1 ఇమేజ్ ఆకార నిష్పత్తి
- ఇమేజ్‌లో హారిజన్ చుట్టూ ఖాళీలు ఉండకూడదు
- జత చేయడంలో గణనీయమైన ఎర్రర్లు ఉండకూడదు
- వెలుతురు/చీకటి ప్రాంతాలు స్పష్టంగా ఉండాలి
- స్పష్టత: మోషన్, బ్లర్ ఉండకూడదు, ఫోకస్ చేసి ఉండాలి
- ఇమేజ్ కింది భాగంతో సహా, ఎక్కడ ఫోకస్ తప్పేలా చేసే ఎఫెక్ట్లు లేదా ఫిల్టర్లు ఉండకూడదు
కనెక్టివిటీ
- కనెక్ట్ చేయబడిన 360 ఫోటోలన్నీ, చూపించాల్సిన ఐటెమ్‌లను స్పష్టంగా చూపించాల్సి ఉంటుంది
- లోపలి ప్రదేశాలలో 1 మీటర్ దూరం నుండి, వెలుపలి ప్రదేశాలలో 3 మీటర్ల దూరం నుండి షూట్ చేయండి
- మీ కలెక్షన్‌ను వీధి వరకు విస్తరింపజేయడం ద్వారా మాతో కనెక్ట్ కాగలిగే అవకాశాలను పెంచుకోండి
సముచితత్వం
- వ్యక్తులు, స్థలాలను చూపడానికి సమ్మతి అవసరం
- భౌగోళికంగా ఖచ్చితమైన నియామకాన్ని కలిగి ఉండాలి
- ఇమేజ్ మిర్రరింగ్ లేదా వార్పింగ్తో సహా కంప్యూటర్లో జెనరేట్ చేసిన స్పేస్‌లు లేదా గ్రాఫిక్స్ ఉండకూడదు
- కింది భాగంలోని ప్రాంతాన్ని దాటి ఆట్రిబ్యూషన్ ఉండకూడదు
- ద్వేషపూరితమైన లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ ఉండకూడదు
నిషేధిత పద్ధతులు
అనుచితమైన కంటెంట్
నిషేధించిన, ఇంకా నియంత్రిత కంటెంట్‌ను Maps యూజర్ కంట్రిబ్యూటెడ్ కంటెంట్ పాలసీలో కనుగొనవచ్చు.
మీరు అనుచితమైన కంటెంట్‌ను "సమస్యను రిపోర్ట్ చేయండి" లింక్‌లో రిపోర్ట్ చేయవచ్చు.
అసత్యమైన, తప్పుదారి పట్టించే లేదా అవాస్తవమైన క్లెయిమ్‌లు
Street View విశ్వసనీయ ఫోటోగ్రాఫర్ల క్లయింట్లు, Street View విశ్వసనీయ ఫోటోగ్రాఫర్లతో పని చేయడం గురించి విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మేము సూచిస్తున్నాము, అంటే మీ కంపెనీ, మీ సర్వీస్‌లు, ఆ సర్వీస్‌లతో ముడిపడి ఉన్న ఖర్చులు, మీ క్లయింట్లు ఆశించగల ఫలితాల గురించి వివరించేటప్పుడు మీరు ముక్కుసూటిగా, నిజాయితీగా వ్యవహరించాల్సి ఉంటుందని అర్థం. అసత్యమైన, తప్పుదారి పట్టించే లేదా అవాస్తవమైన క్లెయిమ్‌లు చేయకండి.
ఉదాహరణలు:
- Googleతో తప్పుడు అనుబంధాన్ని క్లెయిమ్ చేయడం
- Google Street View లేదా Google Mapsలో టాప్ ప్లేస్మెంట్ ఇస్తామంటూ హామీ ఇవ్వడం
వేధించడం, దూషణలకు పాల్పడే లేదా మోసపూరితమైన ప్రవర్తన
Street View క్లయింట్లకు నేరుగా Googleతో పని చేసేటప్పుడు ఎంత గొప్ప సర్వీస్ అయితే లభిస్తుందో, వారికి Street View ఫోటోగ్రాఫర్‌తో పని చేసేటప్పుడు కూడా అంతే గొప్ప సర్వీస్ లభించాలి. కస్టమర్లుగా అయ్యే అవకాశం ఉన్న వారిని లేదా ఇప్పటికే ఉన్న కస్టమర్లను పీడించడం, అభ్యంతరకరంగా ప్రవర్తించడం లేదా మోసపూరితమైన ప్రవర్తనలను చూపకండి.
ఉదాహరణలు:
- కస్టమర్‌గా మారే అవకాశం ఉండే వారిని చీటికి మాటికి సంప్రదించి, వారికి విసుగు తెప్పించడం
- సైన్ అప్ చేయాలని లేదా మీ ఏజెన్సీతో ఉండాలని అడ్వర్టయిజర్పై అనవసరమైన ఒత్తిడి తేవడం
- మీ తరఫున ఇతరులు Google సర్టిఫికేషన్ పరీక్షలలో పాల్గొనేలా చేయడం
- ఫిషింగ్
- పేమెంట్‌కు ప్రతిఫలంగా Google Ads వోచర్లను అందించడం
మా పాలసీల పరిచయం
Googleకు సంబంధించిన Street View విశ్వసనీయ ఫోటోగ్రాఫర్ పాలసీ గురించి మీరు అవగాహన పొంది, దాని గురించి అప్డేట్ అయ్యి ఉండటం ముఖ్యం. మీరు మా పాలసీలను ఉల్లంఘిస్తున్నారని మేము విశ్వసిస్తే, మీ ఆచరణీయ పద్ధతుల గురించి పూర్తి స్థాయిలో రివ్యూ చేయడానికి, అవసరమైతే దిద్దుబాటు చర్యను రిక్వెస్ట్ చేయడానికి మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. పదే పదే లేదా తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే సందర్భాల్లో, మేము మిమ్మల్ని విశ్వసనీయ ప్రోగ్రామ్ నుండి మినహాయించవచ్చు. అలాగే, మీ కస్టమర్లను సంప్రదించి వారికి తదనుగుణంగా తెలియజేయవచ్చు. Google Maps ప్రోడక్ట్‌లకు సహకరించకుండా కూడా మేము మిమ్మల్ని నిరోధించవచ్చు.
థర్డ్ పార్టీలకు వర్తించే ప్రస్తుత నియమాలు, పాలసీలతో పాటుగా ఈ కింది పాలసీలు కూడా వర్తిస్తాయి:
మీరు విధానాన్ని ఉల్లంఘిస్తే ఏమి అవుతుంది
అనుకూలత రివ్యూ: Street View విశ్వసనీయ ఫోటోగ్రాఫర్ పాలసీకి అనుగుణంగా మీ బిజినెస్ ఉందో లేదో మేము ఎప్పుడైనా రివ్యూ చేయవచ్చు. అనుకూలతకు సంబంధించిన సమాచారాన్ని రిక్వెస్ట్ చేయడానికి మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే, మీరు సకాలంలో సమాధానం ఇవ్వవలసి ఉంటుంది, మా పాలసీలకు అనుగుణంగా అవసరమైన ఏదైనా చర్యను త్వరితగతిన చేపట్టాలి. అనుకూలతలను వెరిఫై చేయడానికి మేము మీ కస్టమర్లను కూడా కాంటాక్ట్ చేయవచ్చు.
అనుకూలతను పాటించకపోవడం గురించి నోటిఫికేషన్ మీరు Street View విశ్వసనీయ ఫోటోగ్రాఫర్ పాలసీని ఉల్లంఘిస్తున్నారని మేము విశ్వసిస్తే, సాధారణంగా దిద్దుబాటు చర్య తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. ఇచ్చిన సమయ వ్యవధిలో రిక్వెస్ట్ చేసిన దిద్దుబాట్లను చేయడంలో మీరు విఫలమైతే, మేము ఆంక్షను విధిస్తాము. తీవ్రమైన లేదా పదేపదే జరుగుతోన్న ఉల్లంఘనల విషయంలో, మేము వెంటనే ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా చర్య తీసుకోవచ్చు.
థర్డ్ పార్టీ ప్రోగ్రామ్ తాత్కాలిక నిలిపివేత: Google థర్డ్ పార్టీ ప్రోగ్రామ్‌లు, ఉదా., Google Street View లాంటి వాటిలో మీ భాగస్వామ్యం విశ్వసనీయమైనది, అలాగే Street View విశ్వసనీయ ఫోటోగ్రాఫర్ పాలసీకి అనుగుణంగా ఉందని అంచనా వేయబడింది. మీరు మా పాలసీలను ఉల్లంఘిస్తున్నారని మేము కనుగొంటే లేదా మీ బిజినెస్‌ను అనుకూలత కోసం రివ్యూ చేయడంలో మా ప్రయత్నాలకు మీరు సహకరించకాపోతే, దానిని పరిమితి స్థాయికి కుదించవచ్చు లేదా సస్పెండ్ చేయవచ్చు.
Maps ఖాతా తాత్కాలిక నిలిపివేత: మీరు తీవ్రమైన పాలసీ ఉల్లంఘనకు పాల్పడితే మేము మీ Google Maps ఖాతాలను సస్పెండ్ చేయవచ్చు. పునరావృతంగా లేదా అత్యంత తీవ్రమైన విధాన ఉల్లంఘనలకు పాల్పడే సందర్భాలలో, మీ Google Maps ఖాతాలు శాశ్వతంగా నిలిపివేయబడవచ్చు. ఆపై మీరు Google Mapsకు సహకారం అందించడం కూడా సాధ్యపడకపోవచ్చు. ఇంకా, మీ కస్టమర్లకు తదనుగుణంగా తెలియజేయడానికి మేము వారిని సంప్రదించవచ్చు.
థర్డ్ పార్టీ విధాన ఉల్లంఘనను నివేదించండి
థర్డ్-పార్టీ పార్ట్నర్ ఈ పాలసీని ఉల్లంఘిస్తున్నారని మీరు భావిస్తున్నారా? మాకు తెలియజేయండి: