మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు తెలుసుకోవడంలో సహాయపడటానికి Google అంకితభావంతో ఉంది. మీకు దగ్గర్లోని లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థలాలను ప్రివ్యూ చేయడానికి, వాటిని అన్వేషించడానికి మీకు సహాయపడుతూ మీ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు మా ప్లాట్‌ఫామ్‌లలోని ఇమేజ్‌లు ఉద్దేశించబడ్డాయి. ఈ ఇమేజ్‌లను ఉపయోగకరంగా, మా యూజర్‌లు అన్వేషించే ప్రపంచానికి తగ్గట్లుగా అందించడం కోసం మేము ఎంతో శ్రమిస్తాము.

వీధి వీక్షణ ఇమేజరీని బయటి పార్టీలు కానీ Google కానీ అందించవచ్చు. ప్రతి ఇమేజ్‌లోనూ ఉండే లక్షణం పేరు లేదా చిహ్నం ద్వారా మీరు వ్యత్యాసాన్ని తెలుసుకోవచ్చు. ఎవరైనా బయటి పార్టీ క్యాప్చర్ చేసి, Google Mapsలో ప్రచురించిన ఇమేజరీ, వారికి స్వంతమైనవిగా (లేదా వారు నియమించిన వారసులకు స్వంతమైనవిగా) పరిగణించబడతాయి.

Google కంట్రిబ్యూట్ చేసిన Street View ఇమేజరీ పాలసీని ఈ పేజీ వివరిస్తుంది. యూజర్ కంట్రిబ్యూట్ చేసే, Street View ఇమేజరీ కోసం, దయచేసి Maps యూజర్ కంట్రిబ్యూట్ చేసిన కంటెంట్ పాలసీని చూడండి.

Google కంట్రిబ్యూట్ చేసిన Street View
ఇమేజరీ పాలసీ

Street View ఇమేజరీని చూసే వారందరికీ సానుకూలమైన, ఉపయోగకరమైన అనుభవాన్ని అందించడంలో సహాయపడటానికి, మేము Google కంట్రిబ్యూట్ చేసిన ఈ Street View పాలసీని రూపొందించాము. అనుచితమైన కంటెంట్‌ను మేము ఎలా హ్యాండిల్ చేస్తాము, అలాగే Google Mapsకు Street View ఇమేజరీని పబ్లిష్ చేసేటప్పుడు ఏ ప్రమాణాలను పాటిస్తాము అన్న వాటిని ఇది వివరిస్తుంది. మా పాలసీని మేము అప్పుడప్పుడూ అప్‌డేట్ చేస్తూ ఉండవచ్చు కాబట్టి, దయచేసి దానిని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి.

వీధి వీక్షణ ఇమేజరీ అనేది, రియల్ టైమ్‌లో అప్‌డేట్ కాదు

మా కెమెరాలు ఏదైనా లొకేషన్ గుండా వెళ్లినప్పుడు, ఆ రోజున అవి వేటినైతే క్యాప్చర్ చేయగలవో, వాటిని మాత్రమే Street View ఇమేజరీ చూపుతుంది. ఆ తర్వాత, వాటిని ప్రాసెస్ చేయడానికి కొన్ని నెలలు పడుతుంది. అంటే మీకు కనిపించే కంటెంట్ ఏదైనా, కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల క్రితం తీసినది అయ్యుండవచ్చు. మేము అనేక సంవత్సరాలుగా ఇమేజరీని సేకరించిన కొన్ని లొకేషన్‌లకు సంబంధించిన ఇమేజరీ భవిష్యత్తులో ఎలా మారిందో చూడటానికి మా టైమ్ మెషీన్ ఫంక్షన్‌ను మీరు ఉపయోగించవచ్చు.

బ్లర్ చేయడం

Google Mapsలో వీధి వీక్షణ చిత్రాలను పబ్లిష్ చేసే సమయంలో వ్యక్తుల గోప్యతను రక్షించడం కోసం Google అనేక చర్యలు తీసుకుంటుంది.

Street Viewలో Google కంట్రిబ్యూట్ చేసిన ఇమేజరీలో గుర్తించేందుకు వీలుగా ఉన్న ముఖాలు, లైసెన్స్ ప్లేట్‌లను బ్లర్ చేయడం కోసం మేము ముఖం, లైసెన్స్ ప్లేట్‌ను బ్లర్ చేయగల ఒక అత్యాధునిక టెక్నాలజీని రూపొందించాము. మీ ముఖం లేదా లైసెన్స్ ప్లేట్‌ను మరింతగా బ్లర్ చేయాలని, లేదా మేము మీ ఇల్లు, కారు లేదా శరీరాన్ని పూర్తిగా బ్లర్ చేయాలని మీరు భావిస్తే, "సమస్యను రిపోర్ట్ చేయండి" టూల్ ద్వారా రిక్వెస్ట్‌ను సమర్పించండి.

అనుచిత కంటెంట్

"సమస్యను రిపోర్ట్ చేయండి" link అనే లింక్ ద్వారా మీరు అనుచితమైన కంటెంట్ గురించి రిపోర్ట్ చేయవచ్చు. కంటెంట్‌లో కళాత్మక, విద్యా సంబంధిత, లేదా డాక్యుమెంటరీ విలువ ఉన్న కేటగిరీలు మినహా ఈ కింది కేటగిరీలను మేము అనుచితమైన కంటెంట్‌గా పరిగణిస్తాము.

మేధో సంపత్తి ఉల్లంఘనలు

మేధో సంపత్తి ఉల్లంఘనలు

కాపీరైట్‌ సహా ఇతరుల చట్టపరమైన హక్కులను అతిక్రమించేలా ఉండే ఇమేజ్‌లను లేదా ఏదైనా ఇతర కంటెంట్‌ను మేము అనుమతించము. మరింత సమాచారం కోసం లేదా DMCA రిక్వెస్ట్‌ను ఫైల్ చేయడం కోసం, మా కాపీరైట్ విధానాలను రివ్యూ చేయండి.

లైంగికంగా అసభ్యకరమైన కంటెంట్ చిహ్నం

లైంగికంగా అసభ్యకరమైన కంటెంట్

లైంగికపరంగా అందరికీ తగని కంటెంట్‌ను మేము అనుమతించము.

చట్టవ్యతిరేకమైన, హానికరమైన లేదా హింసాత్మక కంటెంట్‌ను సూచించే చిహ్నం

చట్టవ్యతిరేకమైన, హానికరమైన లేదా హింసాత్మక కంటెంట్

కంటెంట్ చట్టవ్యతిరేకమైనది అయ్యి ఉండి, అది ప్రమాదకరమైన లేదా చట్టవ్యతిరేక చర్యలను ప్రమోట్ చేసే విధంగా ఉంటే, లేదా అందులో స్పష్టంగా చూపే హింస లేదా అవాంఛిత హింస ఉంటే, ఆ కంటెంట్‌ను మేము అనుమతించము.

వేధించడం, బెదిరించడంలను సూచించే చిహ్నం

వేధించడం, బెదిరించడం

వ్యక్తులను పీడించడానికి, వారిపై జులుం చలాయించడానికి, లేదా దాడి చేయడానికి Street Viewను ఉపయోగించే కంటెంట్‌ను మేము అనుమతించము.

ద్వేషపూరిత భాషణ

ద్వేషపూరిత భాషణ

జాతి, జాతి మూలం, మతం, వైకల్యం, లింగం, వయస్సు, జాతీయత, వెటరన్ స్టేటస్, లైంగిక ధోరణి, లేదా లింగ గుర్తింపు ఆధారంగా వ్యక్తులకు లేదా గ్రూప్‌లకు వ్యతిరేకంగా హింసను ప్రమోట్ చేసే లేదా ప్రోత్సహించే కంటెంట్‌ను మేము అనుమతించము.

ఉగ్రవాద కంటెంట్ చిహ్నం

ఉగ్రవాద కంటెంట్

ఉగ్రవాద సంస్థలు తమ నియామకాలతో పాటు ఏ రకమైన అవసరాల కోసం అయినా ఈ సర్వీస్‌ను ఉపయోగించడానికి మేము అనుమతించము. ఉగ్రవాద చర్యలను ప్రమోట్ చేసే, హింసను ప్రోత్సహించే, లేదా ఉగ్రదాడులకు మద్దతుగా వేడుకను జరుపుకునే కంటెంట్ లాంటి ఉగ్రవాదానికి సంబంధించిన కంటెంట్‌ను కూడా మేము తీసివేస్తాము.

పిల్లలకు ప్రమాదావకాశం చిహ్నం

పిల్లలకు ప్రమాదావకాశం

Google పాలసీ ప్రకారం, పిల్లలపై దాడి చేసే లేదా పిల్లలను వేధింపులకు గురిచేసే కంటెంట్‌ను ఏ మాత్రమూ ఉపేక్షించం. పిల్లలపై లైంగిక వేధింపులను ప్రదర్శించే అన్ని రకాల ఇమేజ్‌లతో పాటు, వారిని శృంగారాత్మకంగా చిత్రీకరించే కంటెంట్ రకాలన్నీ నిషేధిత కంటెంట్ కిందకే వస్తాయి. ఏ కంటెంట్ అయినా, ఈ విధంగా పిల్లలపై దాడి చేసే విధంగా ఉందని మీకు అనిపిస్తే, ఆ కంటెంట్‌ను Google దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశమే మీకు ఉన్నా కూడా, దయచేసి అటువంటి కంటెంట్‌ను తిరిగి షేర్ చేయడం కానీ, లేదా దానిపై కామెంట్ చేయడం కానీ చేయవద్దు. మీకు ఇంటర్నెట్‌లో ఇంకెక్కడైనా ఇటువంటి కంటెంట్ కనిపిస్తే, దయచేసి నేరుగా నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (NCMEC)ని సంప్రదించండి.

వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచార చిహ్నం

వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారం

మీకు సంబంధించినదైనా లేదా ఇతరులకు సంబంధించినదైనా కూడా, క్రెడిట్ కార్డ్ వివరాలు, వైద్యపరమైన రికార్డ్‌లు, లేదా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు లాంటి వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారం ఉన్న కంటెంట్‌ను మేము అనుమతించము.